amp pages | Sakshi

తెయూలో నియామకాలపై విచారణ..?

Published on Sat, 04/05/2014 - 02:41

 తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీలో చే పట్టిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీ అక్బర్‌అలీఖాన్‌పై వెల్లువెత్తిన ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలపై హైకోర్టు రిటైర్ట్ జడ్జి శ్రీరాములు నేతృత్వంలో కమిటీని నియమించినట్లు సమాచారం. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ఉన్నత విద్యాశాఖను ఆదేశించినట్లు తెలిసింది. పాలకమండలి ఆమో దం లేకుండానే ఏకపక్షంగా అర్ధరాత్రి నియామకాలు జరపడంపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాశాఖ నుంచి స్పష్టత తీసుకోకుండానే తెయూ వీసీ అక్బర్‌రాత్రికి రాత్రే చేపట్టిన నియామక ప్రక్రియ వి వాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

 జరిగింది ఇదీ...
 డిచ్‌పల్లి మండల కేంద్రం శివారులో ఉన ్న తెలంగాణ యూనివర్సిటీలో 103 బోధన, 7 బోధనేతర సిబ్బంది నియామకాలకు 2012, మే 25న నోటిఫికేషన్ వెలువడింది. 2012 అక్టోబర్- నవంబర్ నెలలో హైదరాబాద్‌లోని వ్యవసాయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలను స్థానికంగా నిర్వహించకుండా హైదరాబాద్‌లో నిర్వహించడంపై వీసీపై అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నియామకాల్లో అర్హతలు లేనివారికి కాల్‌లెటర్లు పంపించారని, రోస్టర్ పాయింట్లు పాటించలేదని, పలువురు అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అయినా ఇవేమీ పట్టించుకోకుండా వీసీ మొండిగా నియామకాలను చేపట్టారు. ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన 54 మందికి 2013, ఫిబ్రవరి 1న నియామక పత్రాలు అందజేశారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ విషయమై అప్పటి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ  ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియామకాలను నిలిపివేశారు. వీటన్నింటిపై విద్యార్థిసంఘాలు, అకడ మిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం నియామకాలను నిలిపివేస్తూ, ఆరోపణలపై ద్విసభ్య విచారణ కమిటీని నియమించింది.

 ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రసాద్‌రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భాస్కర్‌రావును కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ ద్విసభ్య కమిటీ విచారణ జరిపి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందజేసినట్లు సమాచారం. అదే సమయంలో కోర్టు సైతం నియామక ప్రక్రియను నిలిపివేయాలని 2013, మార్చి13న స్టే ఇచ్చింది. దీంతో ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఈ సమాచారం సాయంత్రం వర్సిటీ అధికారులకు అందింది. స్టే తొలగింపు సమాచారం అందిన వెంటనే వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిలు హుటాహుటిన అదేరోజు అర్ధరాత్రి వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకుని నియామక పత్రాలను సిద్ధం చేశారు.  54 మంది అభ్యర్థులకు సమాచారం అందజేసి వర్సిటీకి పిలిపించుకున్నారు. వీరిలో 48 మంది విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఈ నియామకాలకు వర్సిటీ పాలక మండలి అనుమతి లభించలేదు. దీంతో విధుల్లో చేరిన బోధన సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో రెండు నెలల పాటు జాప్యం చేశారు. ఇప్పటికీ కొత్తగా విధుల్లో చేరిన అధ్యాపకులు ఇంకా అభద్రతా భావంతోనే పనిచేస్తున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)