amp pages | Sakshi

కేజీబీవీల్లో ఇంటర్‌కు గ్రీన్‌సిగ్నల్‌

Published on Mon, 06/11/2018 - 14:25

సాక్షి, కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌ : బాలికల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఇంటర్‌ బోధనకు ఈవిద్యా సంవత్సరం నుంచే గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. అనాథలు, పేద కుటుంబాల బాలికలకు పాఠశాలస్థాయి విద్యను అందిస్తున్న వీటిలో ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. డిప్యూటి సీఎం కడియం శ్రీహరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కస్తూరిభా పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్యను ప్రారంభించేందుకు చొరవ చూపారు. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్‌ తరగతులు ప్రారంభించేలా విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లల్లో మునిగింది.

 
నాలుగు కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొదటిగా నాలుగు కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ విద్యను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌ నియోజకవర్గంలోని సప్తగిరికాలనీ లో కేజీబీవీ పాఠశాల, చొప్పదండిలోని గంగాధర, మానకొండూర్‌లోని శంకరపట్నం, హుజూరాబాద్‌లోని జమ్మికుంట కేజీబీవీల్లో ఇంటర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. కరీంనగర్, శంకరపట్నం, జమ్మికుంట కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, గంగాధర కేజీబీవీలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ఏర్పాటు కానున్నాయి. వీటిల్లోను రెండింట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు, రెండింట్లో సీఈసీ, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌(ఎంపీహెచ్‌డబ్ల్యూ) కోర్సులను ఏర్పాటు చేశారు. ఒక్క కోర్సులో 40 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగు పాఠశాలల్లో 160 సీట్లను భర్తీ చేయనున్నారు. పదో∙తరగతి పూర్తి చేసినవారితోపాటు, ఇతర పాఠశాలల్లో చదివిన వారు కూడా ప్రవేశాలు పొందవచ్చు. బోధనతో పాటు ఉచిత వసతి, భోజనం, ఇతర సదుపాయాలను ప్రభుత్వమే కల్పించనుంది.


13 వరకు దరఖాస్తుల గడువు
కేజీబీవీల్లో ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 13లోగా దరఖాస్తులు సమర్పించాలని డీఈవో వెంకటేశ్వర్లు సూచించా రు. అనాథలు, నిరుపేదలు పదో తరగతి పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. హాస్టల్‌ వసతి కల్పిస్తామని, ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల 25నుంచి తరగతులు తెలుగు మీడియంలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. 


సిబ్బంది నియామకం
ప్రస్తుతం కేజీబీవీల్లో సిబ్బంది కొరతతో సతమ తం అవుతున్నారు. కొత్తగా నాలుగుచోట్ల ఇంటర్‌ ప్రవేశపెడుతుండడంతో బోధకుల కొరత సమస్యగా మారింది. పోస్టుగ్రాడ్యుయేట్‌ కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్‌(పీజీసీఆర్‌టీ)లను నియామకం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒప్పంద పద్ధతిలో నియామకాలు ఉంటాయని, గౌరవ వేతనం రూ.23 వేల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, తెలుగు, ఆంగ్లం, బోటనీ, జువా లజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, జనరల్‌ ఫౌం డేషన్‌ నర్సింగ్‌ కోర్సులతోపాటు 28 పోస్టులు ఉ న్నాయని, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 13 లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌