amp pages | Sakshi

టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి

Published on Fri, 04/07/2017 - 02:56

బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో డాక్టర్‌ కె.లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండ గట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా పార్టీని తీర్చిదిద్దుతామన్నారు.

యూపీ, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ విజయంతోనైనా కుహనా లౌకికవాదులు కులం, మత, భాష ప్రాతిపదికన ప్రజలను విడగొట్టే చర్యలను విడనాడాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించే విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. వచ్చే ఎన్నికలకల్లా రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతున్నదని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీ ధర్‌రావు ఆరోపించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ ఎస్వీ శేషగిరిరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, బద్దం బాల్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, ఎస్,.కుమార్, శేరి నరసింగరావు, సుధాకరశర్మ తదితరులు పాల్గొన్నారు.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌