amp pages | Sakshi

తాండూరుకు కృష్ణమ్మ!

Published on Wed, 04/22/2015 - 00:53

వాటర్‌గ్రిడ్‌తో తరలిరానున్న జలాలు
► ప్రభుత్వానికి రూ.53 కోట్లతో ప్రతిపాదనలు
► ఇంటింటికీ నల్లా కనెక్షన్లు

 
తాండూరు : తాండూరుకు కృష్ణాజలాలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్‌లో భాగంగా తాండూరువాసులకు కృష్ణాజలాలు అందనున్నాయి. దాంతో వచ్చే రెండు, మూడేళ్లలో అందరికీ  ఫిల్టర్ వాటర్ అందుబాటులోకి రానున్నది. వాటర్ గ్రిడ్‌తో  పైప్‌లైన్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వాటర్‌గ్రిడ్ కోసం తాండూరు మున్సిపల్ అధికారులు సుమారు రూ.53కోట్ల నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి షాద్‌నగర్, పరిగి, యాలాల మీదుగా తాండూరు పట్టణానికి, ఇక్కడి నుంచి చివరి పాయింట్ పెద్దేముల్‌కు కృష్ణాజాలలు పైప్‌లైన్ ద్వారా సరఫరా (గ్రావిటీ) కానున్నాయి. పట్టణంలో 65వేలకుపైగా జనాభా ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీకి చెందిన ఆరు రిజర్వాయర్లు ద్వారా ప్రతి రోజు 6 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) తాగునీరు సరఫరా అవుతుంది. మొత్తం 14వేలకుపైగా గృహాలు ఉన్నాయి. ఇందులో 7వేల గృహాలకు మాత్రమే నల్లా కనెక్షన్‌లు ఉన్నాయి.

వాటర్‌గ్రిడ్ ద్వారా పట్టణ శివారులోని ఖాంజాపూర్ గుట్టపై 10లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఇక్కడనే ఒక సంపు కూడా నిర్మిస్తారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఖాంజాపూర్ గుట్టపై నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరతాయి. ప్రస్తుతం ఉన్న ఆరు రిజర్వాయర్లకు అదనంగా రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఖాంజాపూర్ గుట్ట సంపు నుంచి రిజర్వాయర్ల ద్వారా కృష్ణాజలాలు సరఫరా జరుగుతుంది.

6 ఎంఎల్‌డీ నుంచి 11ఎంఎల్‌డీకి తాగునీటి సామర్థ్యం పెరగనున్నది. దాంతోపాటు ఇంటింటికీ నల్లా కనెక్షన్‌లు ఇవ్వడానికి ఆస్కారం కలుగుతుంది. రెండు, మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ద్వారా తాండూరుకు కృష్ణాజలాలు అందుబాటులోకి రానున్నట్టు  చెబుతున్నారు. 15ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా డిజైన్ చేసినట్టు తాండూరు మున్సిపల్ ఇంజనీర్ సత్యనారాయణ తెలిపారు.

Videos

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)