amp pages | Sakshi

లంబాడాలను తొలగించేదాకా.. లడాయే

Published on Fri, 03/09/2018 - 09:41

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు లడాయి ఆగదని పలువురు ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని 
గుడిహత్నూర్‌లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో గురువారం ఆదివాసీ మహిళా పోరుగర్జన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీ మహిళలు భారీగా తరలివచ్చారు. అలాగే ఆదివాసీ ప్రొఫెసర్లు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరై తమ గొంతుక వినిపించారు. మా అస్తిత్వం, స్వాభిమానం కోసమే మా పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. 

ఇతర రాష్ట్రాల ఆదివాసీ నాయకుల రాక
ఆదివాసీ మహిళా పోరు గర్జన సభకు ఇతర రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. వీరిలో ప్రొఫెసర్‌ ఉయిక అమ్రాజ్, దుర్వ సుశీల, ప్రొఫెసర్‌ సువ ర్ణ వార్కెడె, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కంచర్ల వాలంటిన ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా ఆది వాసీ మహిళా నాయకులు కుమ్ర ఈశ్వరీబాయి, దుర్వ చిల్కుబాయి, మర్సకోల కమల, మ డావి కన్నీబాయి, సోందేవ్‌బాయి, లక్ష్మీబాయి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ జెడ్పీ చైర్మన్‌ సిడం గణపతి,  తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాక కా ర్యదర్శి ఉయిక సంజీవ్, ఆదివాసీ విధ్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాక కార్యదర్శి వెడ్మబొజ్జు, కార్యదర్శి కొడప నగేష్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొడప జాలంజాకు, కార్యదర్శి  బాపురావు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, ఉమ్మడి జిల్లా ఆది వాసీ నాయకులు విజయ్,  గోపిచంద్, కుడ్మెత తిరుపతి, భూమయ్య,  పాండురంగ్,  మారుతి,  జలపతి,ఖమ్ము, భాస్కర్, అశోక్,  వెంకటేశ్‌ హైమన్‌డార్ఫ్‌ యూత్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.


అస్తిత్వం కోసమే పోరాటం
మా అస్తిత్వం, స్వాభిమానం కోసమే పోరాడుతున్నామని ప్రొఫెసర్‌ ఉయిక అమ్రాజ్‌ అన్నారు. ప్రకృతి ఒడిలో స్వచ్ఛంగా బతికే మా అమాయకత్వాన్ని చేతకాని తనంగా తీసుకుని ప్రభుత్వాలు తమతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజుల వంశం మాది. అలాంటి మాకు సమాజంలో మనుషులుగా కూడా పరిగణించడం లేదు.


ఉద్యమించక పోతే  మనల్ని క్షమించరు
ఆదివాసీల హక్కులను హరిస్తూ విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో పెత్తనాన్ని అనుభవిస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమిద్దామని ఐటీడీఏ చైర్మన్‌ కనక లక్కేరావు పిలుపు నిచ్చారు. ఉద్యమంలో కలిసిరావాలని కోరారు.

రాష్ట్ర సాధనలో ఆదివాసీ త్యాగాలను మరిచారు
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆదివాసీలు తమదైన శైలిలో ఉద్యమించి చేసిన త్యాగాలు ముఖ్యమంత్రి మరిచారని ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సాధించాక పోలవరం ప్రాజెక్టులో లక్షల మంది ఆదివాసీలు నిరాశ్రయులయ్యారని తెలిపారు.

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం



ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాన్ని చట్ట విరుద్ధంగా లంబాడాలు ఎస్టీలో కొనసాగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వారికి ఉన్న హోదా, రాజ్యాంగ అధికారాలు తదితర అంశాలను పరిశీలించి సమస్యను పరిష్కరిద్దామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ దిశగా అందరం సామరస్యంగా కృషి చేద్దామని ఆమె కోరారు. 
– ఎమ్మెల్యే కోవ లక్ష్మి

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)