amp pages | Sakshi

సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం

Published on Sun, 11/19/2017 - 01:40

సాక్షి, హైదరాబాద్‌: సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి నీరజాశాస్త్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న భూసార పరీక్షలు, భూసార కార్డులు, సేంద్రియ వ్యవసాయ పథకాల పరిశీలనకు నీరజాశాస్త్రి హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా శనివారం వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఎం.జగన్‌మోహన్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లగొం డ, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నా రు. నీరజాశాస్త్రి మాట్లాడుతూ మార్కెటింగ్‌ సదుపాయాల అనుసం ధానం కోసం మార్కెట్‌ యాజమాన్య నిపుణుల సహకారాన్ని తీసుకోవ డానికి యోచిస్తున్నట్లు చెప్పారు.

సేంద్రియ విధానంలో వ్యవసాయం చేస్తున్న రైతులను పథకాల్లో భాగస్వాములను చేస్తే అమలు మరింత మెరుగ్గా జరుగుతుందన్నారు. భూసార కార్డులు, పీకేవీవై పథకాల అమలు, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి జిల్లా వ్యవసాయ అధికారులు సమావేశంలో వివరించారు. భూసార పరీక్షా కార్డులు రైతులకు సక్రమం గా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆమె కీసర మండలం గోధుమకుంట గ్రామంలో జీరో బడ్జెటింగ్‌ పద్ధతిలో సహజ వ్యవసాయం చేస్తున్న రైతు వెంకటరెడ్డి చేనును పరిశీలించారు. ఆయన నేల ఉప పొరల్లోని మట్టిని ఉపయోగించి చేస్తున్న సాగు విధానాన్ని అడిగి తెలుçసుకు న్నారు. అలాగే రాజేంద్రనగర్‌లోని భూసార పరీక్షా కేంద్రాన్ని, జీవఎరువుల ప్రయోగ శాలను సందర్శించారు. భూసార పరీక్షలు చేస్తున్న పద్ధతులు, క్షేత్రస్థాయిలోని ఇబ్బం దులను అడిగి తెలుసుకున్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌