amp pages | Sakshi

2020 నాటికి ఓల్డ్‌సిటీకి మెట్రో

Published on Thu, 03/15/2018 - 08:03

సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీవాసుల మెట్రో కల త్వరలో సాకారం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే పాత నగరానికి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఓల్డ్‌సిటీ మెట్రో ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురించాయి. జేబీఎస్‌–ఫలక్‌నుమా మార్గంలో ప్రస్తు తం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ వరకు మాత్రమే (సుమారు 10 కిలోమీటర్ల మార్గంలో) మెట్రో పనులు దాదాపు పూర్తికావచ్చాయి. అక్కడి నుంచి సుమారు 5.3 కి.మీ దూరంలో ఉన్న ఫలక్‌నుమా వరకు మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రధానంగా ఎంజీబీఎస్‌ నుంచి సాలార్జంగ్‌ మ్యూజియం–చార్మినార్‌–శాలిబండ–శంషీర్‌గంజ్‌–జానంమెట్‌–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఈ మార్గంలో మెట్రో ప్రాజెక్టు కోసం సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉందని హైదరాబాద్‌ మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పుడు పనులు ప్రారంభించి.. ఆస్తుల సేకరణ ప్రక్రియ సజావుగా పూర్తయితే మరో రెండేళ్లలో అంటే 2020లో మాత్రమే పాతబస్తీ వాసులకు మెట్రో కల సాకారం కానుంది. కాగా పాతనగరానికి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల విపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టిన విషయం విధితమే. పాతఅలైన్‌మెంట్‌ ప్రకారం మెట్రో చేపడితే ఈ రూట్లో ఉన్న సుమారు 50 ప్రార్థన స్థలాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని కొన్ని రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ మార్గాన్ని మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం నిర్ణయించింది. అయితే మూసీ గర్భం నుంచి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయడం సాంకేతికంగా సాధ్యపడదని ఎల్‌అండ్‌టీ నిపుణుల కమిటీ తేల్చిచెప్పడంతో సర్కారు పాత అలైన్‌మెంట్‌ వైపే మొగ్గుచూపడం గమనార్హం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌