amp pages | Sakshi

‘మంకీ గన్‌’తో కోతులు పరార్‌

Published on Thu, 10/03/2019 - 09:19

సాక్షి, తొర్రూరు: పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టించి రూ.లక్షల పెట్టుబడితో సాగు చేసిన పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు రైతులు అనేక కష్టాలు పడుతుంటారు. కొంత మంది రైతులు పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు కొండెంగలను సైతం కొనుగోలు చేశారు. ప్రతి రోజు కొండెంగను తమ పంట పొలాల వద్దకు తీసుకెళ్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ కొండెంగలను సైతం ఎదిరించి పంటలను సర్వ నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో తొర్రూరులోని లిటిల్‌ ప్లవర్‌ స్కూల్‌కు చెందిన కొంత మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులు పంట పొలాలను కోతుల బెడత నుంచి కాపాడుకునేందుకు పడుతున్న కష్టాన్ని చూసి తుపాకీ తరహాలో పెద్ద శబ్ధం వచ్చేలా మంకీ గన్‌( మంకీ స్కారర్‌)ను తయారు చేశారు. దాని నుంచి వచ్చే శబ్ధంతో పంట పొలాల నుంచి కోతులు పరారవుతున్నాయి. దీంతో విద్యార్థులను పాఠశాల యజమాన్యం, ఉపాధ్యాయులతో పాటు రైతులు అభినందిస్తున్నారు.

రూ.200 ఖర్చుతోనే..
ఐదు ఫీట్లు ఉండే రెండు రకాల ప్లాస్టిక్‌ పైపులతో ఈ తుపాకీ(మంకీ స్కారర్‌)ని లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ విద్యార్థులు తయారు చేశారు. ప్లాస్టిక్‌ పైపులు, ఒక లైటర్‌తో కేవలం రూ.200 ఖర్చుతో సుమారు 50 తుపాకులను తయారు చేశారు. కార్బైడ్‌ అనే 10 గ్రాముల కెమికల్, 10 మిల్లీలీటర్ల వాటర్‌ను కలిపి లైటర్‌తో నెట్టడంతో ఈ మంకీ గన్‌ పేలి పెద్ద శబ్ధం వస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న కోతులు వెళ్లిపోయే అవకాశం ఏర్పడుతుంది.   

రైతులకు ఉచితంగా అందిస్తాం
పంటలను కోతుల బెడద నుంచి కాపాడేందుకు విద్యార్థులు తయారు చేస్తున్న మంకీ స్కారర్లను ఈ ప్రాంత రైతులకు ఉచితంగా అందిస్తాం. విద్యార్థులు ఇలాంటి ప్రయోగాలు చేసి విజయవంతం అవడం అభినందనీయం. మండలంలోని ఏ గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందో గుర్తించి రైతులకు మంకీ స్యారర్లను అందిస్తాం. 
– అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, స్కూల్‌ కరస్పాండెంట్‌ 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)