amp pages | Sakshi

‘నాయక్’ చిత్రాలు భళా

Published on Fri, 10/10/2014 - 00:39

  • ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’లో గుర్తింపు   
  •  అంతర్జాతీయ స్థాయి పుస్తకంలో చోటు
  •  ‘మెట్రో పోలిస్’ సదస్సులోనూ ప్రదర్శన
  •   ప్రతిభతో ప్రశంసలందుకుంటున్న వర్సిటీ ఆర్టిస్ట్ శ్రీనివాస్
  • రాజేంద్రనగర్: చిత్రకారుడు రమావత్ శ్రీనివాస్ నాయక్ తన కళా ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆర్టిస్టు, ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈయన ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’కు ఎంపికయ్యారు.

    గతనెల 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు నగరంలోని తారామతి బారాదరిలో నిర్వహించిన ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ఎగ్జిబిషన్‌లో శ్రీనివాస్ నాయక్ కుంచె నుంచి జాలువారిన అద్భుతమైన చిత్రాలకు అరుదైన గౌరవం దక్కింది. చిత్రకళా రంగంలో విశ్వఖ్యాతిని ఆర్జించిన పికాసో స్ఫూర్తితో లంబాడాల జీవన విధానాన్ని క్యూబిజమ్ శైలిలో అద్భుతంగా ఆవిష్కరించినందుకు శ్రీనివాస్ నాయక్ పలువురు అంతర్జాతీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

    నల్గొండ జిల్లా మారుమూల ప్రాంతం ఎర్ర చెరువు తండాకు చెందిన శ్రీనివాస్ పేద కుటుంబంలో జన్మించారు. ఈయన పాఠశాల స్థాయిలోనే అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. నగరంలోని జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీఎఫ్‌ఏలో ప్రవేశం పొందారు. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆర్టిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. ఇప్పటివరకు ఈయన 500 క్యూబిజమ్ చిత్రాలు, రెండువేలకు పైగా క్యారికేచర్‌లు వేశారు.

    ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ అవార్డు, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వారు నిర్వహించిన పోటీల్లోనూ అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రాలను వేసినందుకు గాను ఆర్ట్ ఎట్ తెలంగాణ నుంచి రూ.25 వేల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. మెట్రో పోలిస్ సదస్సులో 90 చిత్రాలు, చిత్రకారుల బయోడేటాతో కూడిన పుస్తకాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ముద్రించారు. వీటిని సదస్సుకు హాజరైన 114 దేశాల ప్రతినిధులకు అందజేశారు.
     

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)