amp pages | Sakshi

వీరంతా ఏమయ్యారో?

Published on Mon, 05/05/2014 - 00:04

 సాక్షి, సిటీబ్యూరో: అదృశ్యమైన వారు ఎక్కడున్నారో? ఏమయ్యారో తెలియక బాధిత కుటుంబాలు వారి కోసం ధీనంగా ఎదురు చూస్తుండగా... పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసుల దర్యాప్తును తూతూ మంత్రంగా జరిపి, ఆచూకీ దొరకలేదని కేసులను మూసివేస్తున్నారు. దీంతో బాధితులకు న్యాయం జరగడంలేదు.  ఇలా గత ఆరేళ్లలో నగరంలో 14,835 అదృశ్యం కేసులు నమోదు కాగా, వీటిలో 8.325 కేసులను పోలీసులు ఛేదించారు.ఇంకా 6,510 మంది ఆచూకీ నేటికీ తెలియరాలేదు.  వీరిలో బాలికలు 1,310 మంది, బాలురు 770 మంది కాగా... మహిళలు 1,985 మంది, పురుషులు 2,445 ఉన్నారు.

అసలు వీరంతా బతికే ఉన్నారా..? ఉంటే ఎక్కడున్నారు..? అనే ప్రశ్నలకు పోలీసుల నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రావడంలేదు. దర్యాప్తు పరంగా తాము చేయాల్సిందంతా చేశామని, ఇక ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారు.  అదృశ్యమైన వారిలో విద్యార్థులు, వ్యాపారులతో పాటు పోలీసులూ ఉండటం గమనార్హం.  నమోదవుతున్న మిస్సింగ్ కేసులు బాలుర కంటే బాలికలవే ఎక్కువ ఉంటున్నాయి. గత ఆరేళ్లలో తప్పిపోయిన వారిలో బాలురు 2.029 కాగా, బాలికలు 3,343 మంది. ముఖ్యంగా అదృశ్యమైన బాలికలు, మహిళల విషయంలో వారి కుటుంబసభ్యులు పడే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. ఠాణాల చుట్టూ ప్రదక్షిణలు చేసి.. చేసి చివరకు దేవుడిపై భారం వేస్తున్నారు.  ఉన్నతాధికారులు మిస్సింగ్ కేసులపై దృష్టి పెట్టకపోవడంతోనే తమకు న్యాయం జరగడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 కేసు దర్యాప్తు ఇలా...
 ఎవరైనా తమ కుటుంబ సభ్యుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత అదృశ్యమై వ్యక్తి పూర్తి వివరాలతో పాటు ఫొటోను తీసుకుంటారు. వాటిని పొందుపర్చి లుక్‌అవుట్ నోటీస్ జారీ చేస్తారు. చుట్టుపక్కల ఠాణాలకు, సరిహద్దు జిల్లాల పోలీసులకు ఆ సమాచారం పంపుతారు. అప్పటికీ అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ దొరక్కపోతే ఇతర రాష్ట్రాలకు కూడా సమాచారం పంపుతారు.  ఆరు నెలలలోపు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోతే ఆ కేసును తాత్కాలికంగా మూసివేస్తారు. ఆ తర్వాత ఏదైనా కేసులో ఆధారాలు లభిస్తే మాత్రమే తిరిగి తెరుస్తారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)