amp pages | Sakshi

చదువుతో పాటే ఉపాధి

Published on Sun, 12/31/2017 - 02:49

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాల్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే పరిశ్రమలకు అవసరమైన కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని ఇంజనీరింగ్‌ పాఠ్యాంశాలకు జోడించాలని యోచిస్తోంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఇంజనీరింగ్‌ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏర్పాటైన సబ్‌ కమిటీలు హాజరయ్యాయి.

మారుతున్న పరిస్థితులు, విస్తరిస్తున్న పరిశ్రమలకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ పాఠ్యాంశంలో సంస్కరణలు చేయాలని, ఇందులో యూనివర్సిటీలు కీలకంగా మారాలని సభ్యులు సూచించారు. ఇంజనీరింగ్‌ విద్య, సాధారణ విద్యనభ్యసించే విద్యార్థులకు మెరుగైన ఉపాధి మార్గాలను చూపడానికి, నిరుద్యోగాన్ని భారీగా తగ్గించడం కోసం సబ్‌ కమిటీలు పనిచేయనున్నాయి. అలాగే పాఠ్యాంశం, ఇంటర్న్‌షిప్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్, యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్‌ కేంద్రాల కోసం కమిటీలు కృషి చేస్తాయి.

వర్సిటీల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇంక్యుబేషన్‌ కేంద్రాల్లో విద్యార్థులు వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. పరిశ్రమల అవసరాలు ఏమిటనే అంశం ఆధారంగా విద్యార్థులు తమ ఆలోచనలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఓయూ వీసీ రామచంద్రమ్, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, కేయూ వీసీ సాయన్న, జేఎన్‌టీయూఎఫ్‌ వీసీ కవితాదర్యాని, ఆర్జీయూకేటీ వీసీ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)