amp pages | Sakshi

‘అమ్మహస్తం’.. అస్తవ్యస్తం!

Published on Thu, 08/21/2014 - 02:06

ఘట్‌కేసర్ టౌన్: అమ్మహస్తం పథకం ప్రజలకు మొండిచెర్య చూపుతోంది. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు రూ. 185కే ఉప్పు, కారం, చింతపండు, గోధుమలు, గోధుమపిండి, పామాయిల్,  పంచదార, కందిపప్పు, పసుపు సరుకులను అందించాలని గత ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఉగాది పండుగకు ప్రారంభమైన ఈ పథకం ఏడాదిలోపే నీరుగారిపోరుుంది. తొమ్మిది సరుకులు అందించాల్సి ఉన్నా కేవలం పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పామాయిల్, కందిపప్పు, గోధుమలు అందడం లేదు. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు.

 నాణ్యత లేని సరుకులు..
 అవ్ము హస్తం పథకం కింద ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత కరువైంది. దీంతో లబ్ధిదారులు ఈ సరుకులను తీసుకెళ్లడం లేదు. కాలం చెల్లిన చింతపండు, పురుగులు తిరుగుతున్న గోధుమపిండి,  వినియోగించలేని విధంగా ఉన్న కారం పొడి, పసుపు, ఉప్పు సరుకులు సరఫరా అవుతుండటంతో వినియోగదారులు రేషన్ దుకాణాలకు బదులు బయుట సరుకులు కొనుగోలు చేయుడంతో పేదలకు ఆర్థికభారం తప్పడం లేదు.

రేషన్ దుకాణాల్లో కిలో గోధుమలు రూ.7కు లభిస్తుండగా మార్కెట్‌లో రూ. 15, పామాయిల్ రూ.40కిగాను రూ. 65-70లు, కందిపప్పురేషన్ దుకాణంలో రూ. 50లు ఉండగా మార్కెట్‌లో రూ. 70- 75లకు లభిస్తోంది. వూర్కెట్‌లో సరుకులు కొనుగోలు చేస్తుండటంతో జిల్లా లో ఉన్న 10.8 లక్షల తెల్ల రేషన్ కార్డు వినియోగదారులపై రూ. కోట్లాడి భా రం పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని పేదలు కోరుతున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌