amp pages | Sakshi

ఈ–వేలం పై వివాదం

Published on Wed, 03/27/2019 - 07:29

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులను పక్కవాడి జేబులో నింపేందుకు హెచ్‌ఎండీఏ తాపత్రయపడుతోంది. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్లను ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో ఈ–వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించిన అధికారులు... ఆ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించడంపై వివాదం నెలకొంది. ఏడాదిన్నర క్రితమే ఈ కంపెనీకి ఈ–టెండర్, ఈ–వేలం అప్పగించే గడువు ముగిసినప్పటికీ హెచ్‌ఎండీఏ అధికారులు తిరిగి అదే కంపెనీకి బాధ్యతలు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వానికి చెందిన ఈ–ఆక్షన్‌ వెబ్‌సైట్‌ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా ఆన్‌లైన్‌ వేలం నిర్వహిస్తే బిడ్డర్లు రిజిస్ట్రేషన్, సర్వీస్‌ చార్జీల కోసం చెల్లించే రూ.1,000 ప్రభుత్వ ఖజానాలో చేరేవని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులకు చిరాకు తెప్పించేలా హెచ్‌ఎండీఏ వ్యవహారం ఉందని సచివాలయంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. 

ముగిసిన ఒప్పందం...  
ఆన్‌లైన్‌లో టెండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు ఎంఎస్‌టీసీ సేవలందించాలని మూడేళ్ల క్రితం జీఓ జారీఅయింది. ఒకవేళ మూడేళ్ల కంటే ముందే ప్రభుత్వ టెండర్ల వెబ్‌సైట్‌ అందుబాటులోకి వస్తే ఎంఎస్‌టీసీ ఒప్పందం రద్దవుతుందని జీవో నంబర్‌.16లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. 2017 అక్టోబర్‌ 3 నుంచి ప్రభుత్వ టెండర్ల నిర్వహణ వెబ్‌సైట్‌ అందుబాటులోకి రాగా... అప్పటి నుంచి అన్ని ప్రభుత్వ టెండర్లు కూడా ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ నుంచే నిర్వహిస్తున్నారు. అధికారికంగా ఎంఎస్‌టీసీ ఎలాంటి ఈ–టెండర్ల నిర్వహణ చేపట్టరాదని జీవో నంబర్‌ 14, 11లలో ఐటీ శాఖ స్పష్టంగా పేర్కొంది.

ఐటీ శాఖ ఆరా...  
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు టెండర్లను ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ ద్వారా నిర్వహిస్తుంటే... హెచ్‌ఎండీఏ గడువు ముగిసిన ఎంఎస్‌టీసీకి బాధ్యతలు అప్పగించడం వెనకున్న రహస్యం ఏమిటని ఐటీ శాఖ ఆరా తీస్తోంది. ఎంఎస్‌టీసీ ద్వారా టెండర్లకు వెళ్లడంతో కంపెనీలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.10 వేలు అవుతోంది. అయితే హెచ్‌ఎండీఏ ప్లాట్లకున్న క్రేజీ దృష్ట్యా ఆ సంస్థ రిజిస్ట్రేషన్‌ ఫీజును రూ.1,000గా నిర్ధారించారు. ఆ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సి ఉండగా... ఇతర సంస్థలకు మళ్లించడంపై ప్రభుత్వం పెద్దలు గుర్రుగా ఉన్నారు. అదే ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా అయితే వేలానికి కంపెనీలు వెళ్లినా, వ్యక్తులు వెళ్లిన కేవలం రూ.1000 మాత్రమే రిజిస్ట్రేషన్‌ ఫీజు తీసుకుంటున్నారు. దీన్ని వదిలి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి ఆన్‌లైన్‌ వేలం నిర్వహణ అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని ఐటీ శాఖ పేర్కొంటోంది. అసలు దీని వెనుక ఏం జరిగిందనే దానిపై ఇంటెలిజెన్స్‌ అధికారులు కూపీ లాగనున్నట్లు తెలిసింది. హెచ్‌ఎండీఏ అధికారులు ఎవరైనా  చేతివాటం ప్రదర్శించారా? అనే దిశగా విచారణ నిర్వహించనున్నట్లు తెలిసింది.  

సమర్థులనే అప్పగించాం..  
ఏడాది క్రితం హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లు, గిఫ్ట్‌ డీడ్‌ ప్లాట్ల ఆన్‌లైన్‌ వేలాన్ని ఎంఎస్‌టీసీకి అప్పగించాం. వారు సమర్థంగా నిర్వహించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ–వేలం పూర్తయింది. అయితే గతేడాది నవంబర్‌లో ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్ల ఆన్‌లైన్‌ వేలాన్ని ఐసీఐసీఐ ఈ–ఆక్షన్‌ టైగర్‌.నెట్‌కు అప్పగించగా సాంకేతిక కారణాలతో రద్దయింది. అందుకే ఈసారి కూడా ఎంఎస్‌టీసీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం.    – రాంకిషన్, హెచ్‌ఎండీఏ కార్యదర్శి 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)