amp pages | Sakshi

31వ తేదీ వరకూ చేరొచ్చు

Published on Sat, 07/29/2017 - 02:13

ఇంజనీరింగ్‌ ప్రవేశాల గడువు పొడిగించిన విద్యాశాఖ
30న జేఈఈ స్పెషల్‌ కౌన్సెలింగ్‌కు విద్యార్థులకు అవకాశం
3న ఇంటర్నల్‌ స్లైడింగ్‌.. 4న స్పాట్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌


సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్, కాలేజీల్లో చేరే గడువును ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో 6,510 సీట్ల భర్తీకి ఈ నెల 30న స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సెంట్రల్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (సీఎస్‌ఏబీ) ప్రకటించడం.. మరోవైపు ఎంసెట్‌  చివరి దశ కౌన్సెలింగ్‌ పూర్తవడంతో ఈనెల 29లోగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇచ్చి కాలేజీల్లో చేరాలని సాంకేతిక విద్యా శాఖ పేర్కొనడంతో రాష్ట్ర విద్యార్థులు గందరగోళంలో పడ్డారు.

 దీంతో జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు పొందే అవకాశాన్ని రాష్ట్ర విద్యార్థులు కోల్పోయే అంశంపై శుక్రవారం ‘చూడాలా.. చేరాలా..?’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనంపై సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ వాణిప్రసాద్‌ స్పందించారు. అధికారులతో సమావేశమై ప్రవేశాల గడువును ఈనెల 29 నుంచి 31కి పొడిగించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం వెంటనే సమాచారాన్ని పంపింది. ఈ నెల 31 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయవచ్చని, కాలేజీల్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు అందజేసి చేరొచ్చని పేర్కొంది. సీట్లను రద్దు చేసుకోవాలనుకునే వారు కూడా ఈనెల 31 మధ్యాహ్నం 2 గంటల వరకు సీట్లు రద్దు చేసుకోవచ్చని ప్రకటించింది.

బ్రాంచీ మారితే..
సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరిన బ్రాంచీల్లో కాకుండా ఇతర బ్రాంచీలకు మారాలనుకుంటే ఆగస్టు 3న నిర్వహించే ఇంటర్నల్‌ స్లైడింగ్‌లో పాల్గొనాలని, ఇందుకు కాలేజీల్లోనే సంప్రదించాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. క్యాంపు కార్యాలయం కేటాయించిన బ్రాంచీలో కాకుండా స్లైడింగ్‌ ద్వారా మరో బ్రాంచీకి మారితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు.

4 నుంచి 9 వరకు స్పాట్‌ అడ్మిషన్లు
కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి వచ్చే నెల 4న యాజమాన్యాలు స్పాట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి 9లోగా పూర్తి చేయాలని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. స్పాట్‌ అడ్మిషన్లలో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాలను వచ్చే నెల 11లోగా ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలన్నారు. వాటికి సంబంధించిన హార్డ్‌ కాపీలు, డీడీలను 16లోగా ప్రవేశాల క్యాంపు కార్యాలయా నికి పంపించాలని సూచించారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)