amp pages | Sakshi

27 ఏళ్ల యువకుడు.. 77 ఏళ్ల వృద్ధుడు

Published on Sat, 11/15/2014 - 05:55

మెట్‌పల్లి:  అతడి వయసు 27 ఏళ్లు.. కానీ పాస్‌పోర్టు ప్రకారం చూస్తే 77 సంవత్సరాలు.. ఇదెలా సాధ్యమంటారా..? అంతా పాస్‌పోర్టు కార్యాలయం వారి మాయ!... తప్పును సరిచేయమంటూ ఏడేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకునేవారే లేకుండా పోయారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేటకు చెందిన బొమ్మెన శ్రీనివాస్‌కు 2007 మార్చి9న పాస్‌పోర్టు జారీ అయ్యింది. అయితే, అందులో అతని పుట్టిన తేదీని 1937 మే 3గా పేర్కొన్నారు.

వాస్తవానికి శ్రీనివాస్ సమర్పించిన ఆరో తరగతి టీసీ ప్రకారం అతని పుట్టిన తేదీ 1987 మే 3. కానీ, అధికారులు తప్పు చేయడంతో అతని వయస్సు 77 ఏడు ఏళ్లుగా నమోదైంది. ఈ తప్పును సరిచేయాలని అతను ఏడేళ్లుగా తిరుగుతున్నా.. అదిగో, ఇదిగో అంటున్నారే తప్ప పట్టించుకోవడం లేదు. గల్ఫ్ దేశాలకు వెళ్లాలనే ఉద్దేశంతో పలువురు ఏజెంట్లను తన పాస్‌పోర్టును ఇవ్వగా, అందులో ఉన్న వయస్సును చూపి కంపెనీలు వీసా ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పును సరిదిద్దాలని శ్రీనివాస్ కోరుతున్నారు.
 

Videos

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు

కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?