amp pages | Sakshi

కార్తీక్‌ పేరుతో మావోలతో కార్యకలాపాలు.. 

Published on Fri, 01/31/2020 - 05:27

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చింతకింద కాశింకు నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. కాశింను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని, కాశింపై పోలీసులు పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు గజ్వేల్‌ సహాయ పోలీస్‌ కమిషనర్‌ పి.నారాయణ కౌంటర్‌ దాఖలు చేశారు. రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలం వ్యాప్తి కోసమే కాశిం ప్రొఫెసర్, జర్నలిస్ట్‌ అనే ముసుగులు వేసుకున్నారని పేర్కొన్నారు.

ప్రొఫెసర్‌గా ఉంటూ విద్యార్థుల్లో మావోయిస్టు పార్టీ భావజాలాన్ని నూరిపోసి ఆ పార్టీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపారు. బలమైన ఆధారాలు ఉన్నందునే పోలీసులు కాశింను అరెస్టు చేశామని, అంతా చట్ట ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఉంటాయని తెలిపారు. పలువురు నేతలను పొట్టనబెట్టుకున్న నేర చరిత్ర కూడా మావోయిస్టు పార్టీకి ఉందని, అందుకే ప్రభుత్వం సీపీఎం (మావోయిస్టు) పార్టీని గతంలోనే నిషేధించిందని వివరించారు. అలాంటి పార్టీతో కాశింకు సంబంధాలు ఉన్నాయని గతంలో పట్టుబడిన మావోయిస్టులు చెప్పారని తెలిపారు.

మావోయిస్టులకు సహకారం అందించడమే కాకుండా తెర ముందు ఆ పార్టీ భావజాలాన్ని వినిపించే సంస్థల్లో కాశిం ప్రముఖుడని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దారుణాలకు పాల్పడే మావోయిస్టులతో కాశింకు సంబంధాలు ఉన్నట్లుగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే చట్ట ప్రకారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. కాశింపై పోలీసులు నమోదు చేసిన కేసు చట్టబద్ధమేనని.. గడ్డం లక్ష్మణ్‌ దాఖలు చేసిన రిట్‌ను కొట్టేయాలని కోరారు.

కార్తీక్‌ పేరుతో మావోలతో కార్యకలాపాలు.. 
‘కాశిం గళాన్ని అణచివేయడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక గొంతుకల్ని నొక్కేయడం లేదు. మావోయిస్టుల పేరుతో చందాలు వసూలు చేశారు. 2016లో ఉన్న కేసులు అరెస్టు చేయకపోవడం వల్లే పరారీలో ఉన్నట్లు పేర్కొన్నాం. కాశిం ఇంట్లో సోదాలు ఆయన భార్య స్నేహలత సమక్షంలోనే చేశాం. సోదాల సమయంలో వీడియో చిత్రీకరణ కూడా చేశాం. స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్, కంప్యూటర్‌ వంటి వాటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించాం. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల ఆ పరీక్షల్లో ఏమీ తేలలేదు. కాశింపై మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి.

మరో రెండు కేసుల్లో నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. మావోయిస్టుల పేరుతో చేస్తున్న కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అన్ని సాక్ష్యాధారాలను సేకరించాకే కాశింను అరెస్టు చేశాం. అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులతో కార్తీక్‌ అనే పేరుతో కాశిం సంప్రదిస్తున్నారు. 2018లో శ్యాంసుందర్‌రెడ్డి అనే మావోయిస్టు ఇచ్చిన వాంగ్మూలంలో ద్వారా కాశిం గురించి మరిన్ని వివరాలు తెలిశాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి కూతురే కాశిం భార్య స్నేహలత. ఆమె కూడా అదే కేసులో నిందితురాలు. అత్యాధునిక ఆయుధాలతో 150 మంది తీవ్రవాదులు రహస్యంగా ఉన్నారు. వారందరి భావజాలాన్ని కాశిం ప్రొఫెసర్‌ ముసుగులో వ్యాప్తి చేస్తున్నారు’అని పోలీసులు కౌంటర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)