amp pages | Sakshi

విద్యుదాఘాతంలో రైతు మృతి

Published on Mon, 12/15/2014 - 23:09

నర్సాపూర్ రూరల్ : వ్యవసాయ బోరు మోటార్‌కు చెందిన ప్యానల్ బోర్డుకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు.  ఈ సంఘటన మండలంలోని చిన్నచింతకుంటలో సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బ్యాగరి స్వామి (33) తనకున్న ఎకరం భూమిలో కరెంట్ కోతను దృష్టిలో ఉంచుకుని రబీలో మొక్క జొన్నను సాగు చేస్తున్నాడు. కాగా వ్యవసాయానికి షిఫ్ట్ పద్ధతిన ఒక వారం రాత్రి ఒక వారం పగలు కరెంట్ సరఫరా అవుతోంది. సోమవారం వేకువజామున 3 గంటల సమయంలో కరెంట్ సరఫరా అవుతుందని తెలుసుకుని ఆదివారం రాత్రి సుమారు పది గంటల సమయంలో ఇంటి నుంచి బయలు దేరాడు.

వేకువజామున కరెంట్ సరఫరా రాగానే స్తంభం నుంచి ప్యానల్ బోర్డు లోకి విద్యుత్ సరఫరా చేసే తీగ ఊడిపోయి ఉండడంతో మోటార్ ఆన్  కాలేదు. దీంతో బ్యాటరీ సాయంతో స్తంభం నుంచి కరెంట్ సరఫరా అయ్యే తీగను ప్యానల్ బోర్డుకు బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం అటుగా వెళ్లిన ఇరుగు పొరుగు రైతులు విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలి వెళ్లారు. మృతుని భార్య వీరమణి, ఇద్దరు కూతుళ్ళు మైత్రి (5) వైష్టవి (2)లతో పాటు తల్లి పోచమ్మలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ గోపీనాథ్ తెలిపారు.

మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సంఘటన స్థలాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీపీ అధ్యక్షుడు రామన్నగారి శ్రీనివాస్‌గౌడ్, గ్రామ సర్పంచ్ సరళలు కోరారు. రాత్రి కరెంటే స్వామి ప్రాణాలు తీసిందని తోటి రైతులు ఆరోపించారు. సరైన వర్షాలు పడక రైతులు బోరు బావులను నమ్ముకుని పంటలు సాగు చేసుకుంటూ అనేక కష్టాలు పడుతున్నారని దీనికి తోడు కరెంట్ సమస్యలు తోడుకావడంతో రైతుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)