amp pages | Sakshi

ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దందా: గట్టు 

Published on Tue, 06/12/2018 - 02:10

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలల ఫీజు దందా సాగే విధంగా విద్యను వ్యాపారంగా మార్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. యాజమాన్యాల చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో ప్రతి ఏడాది 10 శాతం రుసుములు పెంచుకోవచ్చని ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ సిఫారసు చేసిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రతి మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఫీజులు పెంచుకునేలా ఉత్తర్వులున్నాయని తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇప్పటికే అడ్డగోలుగా ఉన్న ఫీజుల తగ్గింపునకు చర్యలు తీసుకోని ప్రభుత్వం జోనల్‌ ఫీజు నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసి 10 శాతం కంటే ఎక్కువగా పెంచుకోవచ్చని చెబుతోందన్నారు. విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవటంతో సుమారు 162 ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అపరిమితంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఇటీవల కాగ్‌ వెల్లడించిందని గుర్తు చేశారు. ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని నియంత్రించడానికి ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)