amp pages | Sakshi

పైలాన్ చేరని వాటర్‌గ్రిడ్

Published on Mon, 04/13/2015 - 02:50

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. ప్రణాళికా లోపం, నిధుల కొరతతో ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించే పథకం ఆరంభానికి ముందే ఎదురీదుతోంది. టెండర్లకు ముందే ఆరోపణలు.. పునాది రాయి అయినా వేయక ముందే విపక్షాలు చేస్తున్న విమర్శలు వాటర్‌గ్రిడ్‌ను ముసురుకున్నాయి. తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఆవాసప్రాంతాలకు, 69 పట్టణాలకు నల్లాల ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడం ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన బృహత్తర లక్ష్యం.  కానీ ఈ ప్రాజెక్టు పనులన్నీ నత్త కంటే మెల్లగా సాగుతున్నాయి.
 
పైపులైన్ల టెండర్లకు ఒత్తిళ్లు: వాటర్ గ్రిడ్‌కు రూ.35 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుంది. ఇందులో కీలకమైన పైపుల తయారీ.. కొనుగోలు.. లైనింగ్ ప్రక్రియపై బడా కంపెనీలన్నీ కన్నేశాయి. తెలంగాణ, ఏపీ కంపెనీలతో పాటు జిందాల్, కొరియన్ వాటర్ కంపెనీ ఇప్పటికే తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఐసీఐసీఐ, ఎల్‌ఐసీతో కన్సార్టియంగా ఏర్పడి పెట్టుబడులు పెట్టడంతో పాటు.. ఈ పైపులైన్ కాంట్రాక్టును దక్కించుకునేందుకు జిందాల్ పావులు కదుపుతోంది. కొరియన్ వాటర్ కంపెనీ సైతం రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేం దుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బడా కంపెనీలన్నీ రాష్ట్ర సర్కారుపై రాజ కీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్న ప్రచారం జోరందుకుం ది. అయితే పైపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాలేదు.

ఈలోగా కొన్ని కంపెనీలు తమకు అనుకూలంగా టెండర్ల నిబంధనలుండేలా పైరవీలు చేస్తుండటంతో సర్కారు తల పట్టుకుంది.   నిధు ల సమీకరణకు వీలు గా రాష్ట్ర సర్కారు జనవరిలోనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కానీ.. కార్పొరేషన్‌కు సంబంధిం చిన పాలకవర్గం నియామకాలు కాలేదు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో నిర్మిస్తున్న   పైలాన్ తుదిదశలో ఉంది. ఇప్పటికీ కార్యక్రమానికి పునాది రాయి పడలేదు. ఈలోగానే విపక్షాలు సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంటేక్ వెల్స్‌కు సంబంధించిన ప్యాకేజీల కుదింపు, టెండర్లవ్యవధి తగ్గింపు.. టెండరు మార్గదర్శకాలను కొన్ని కంపెనీలకు అనుకూలంగా మార్చినట్లు విమర్శలు సర్కారును చుట్టుముట్టాయి.  దీంతో పనుల వేగానికి కళ్లెం వేసినట్లు స్పష్టమవుతోంది.
 
సర్వేకే ఆరు నెలలు
వాటర్‌గ్రిడ్ తొలిదశ లైన్ సర్వే ఇటీవలే పూర్తయింది. నెల రోజుల్లో పూర్తవుతుందనుకున్న సర్వే కు ఆరు నెలలు పట్టింది. లైన్‌సర్వేకు లైటింగ్ డిటెక్షన్ రేంజింగ్(లైడార్) వంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని విని యోగిస్తామని చెప్పిన ప్రభుత్వం అది ఖరీదైన ప్రక్రియ కావటంతో వెనకడుగు వేసింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)