amp pages | Sakshi

శవాలను పీక్కుతింటున్నాయ్‌..!

Published on Wed, 12/20/2017 - 01:41

సాక్షి, హైదరాబాద్‌: మనిషి బతికున్నప్పుడు గౌరవం ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. చనిపోయిన తర్వాత శవానికి గౌరవం ఇవ్వడం మన సంప్రదాయం. అయితే.. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శవాలకూ దిక్కు లేకుండా పోతోంది. మార్చురీ సిబ్బంది వచ్చిన శవాలకు సకాలంలో పోస్టుమార్టం చేయకపోవడమే కాక.. ఉన్నవాటికీ రక్షణ కల్పించలేక పోతున్నారు. ఫలితంగా పందికొక్కులు, ఎలుకలు శవాలను పీక్కుతింటున్నాయి. డంపింగ్‌ రూమ్‌లో భారీగా శవాలు పేరుకుపోవడం.. ప్రధాన రహదారికి ఆనుకుని మార్చురీ ఉండటంతో కుక్కలు శవాల కాళ్లు, చేతులు పీక్కుతిన్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఓ శవాన్ని ఎలుకలు, పందికొక్కులు పీక్కుతినడం చర్చనీయాంశమైంది.

సమయం మించిందని అప్పగించి వెళితే..
హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అఫ్జల్‌సాగర్‌కు చెందిన ఉమ(21) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. అప్పటికే సాయంత్రం ఆరు కావడంతో ఫోరెన్సిక్‌ నిపుణులు విధులు ముగించుకుని వెళ్లిపోవడంతో యువతి బంధు వులు శవాన్ని మార్చురీ సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం వచ్చి శవాన్ని పరిశీలించగా.. ముక్కు, పెదాలు, మెడ భాగం ఛిద్రమై కన్పించాయి. దీంతో మార్చురీ సిబ్బందిపై యువతి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు.

కుప్పలుగా శవాలు..
ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో మార్చురీ కొనసాగుతోంది. ఇక్కడికి ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో చనిపోయిన వారి మృతదేహాలే కాక గ్రేటర్‌ శివారు ప్రాంతాల నుంచి మెడికో లీగల్‌ కేసులకు సంబంధించిన శవాలు వస్తుంటాయి. ఇలా రోజుకు సగటున 20–25 శవాలు వస్తుంటాయి. రోజుకు సగటున 15 శవాలకు పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. వీటిని భద్రపరిచేందుకు 32 ్రíఫీజర్‌ బాక్సులు, ప్రత్యేకంగా ఓ గది ఉన్నాయి. పోస్టుమార్టం తర్వాత మూడు రోజుల వరకు బాడీలను భద్రపరిచే వీలుంది. అప్పటికే బాడీ డీకంపోజ్‌ అయితే డంప్‌ రూమ్‌లోకి తరలిస్తారు. బంధువులు శవాలను గుర్తించి తీసుకెళ్లగా, మిగిలిన వాటిని అనాథ శవాలుగా పరిగణించి జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తారు. వీటిని ప్రతి పది రోజులకు ఓసారి సామూహిక దహనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయా వార్డుల్లో భారీగా శవాలు పేరుకుపోతున్నాయి.

తగిన బాక్స్‌లు లేకపోవడం వల్లే..
నిర్దేశిత సమయంలో వచ్చిన శవాలకు అదే రోజు పోస్టుమార్టం చేస్తుండగా, సాయంత్రం నాలుగు తర్వాత వచ్చిన వాటిని ఫ్రీజర్‌ బాక్స్‌లో భద్రపరిచి, పోలీసుల పంచనామా తర్వాత పోస్టుమార్టం చేస్తున్నారు. పోలీసులు పంచనామా ఇన్‌టైమ్‌లో చేయకపోవడం, బంధువులు సకాలంలో రాకపోవడం వల్ల కొన్నిసార్లు రెండు మూడు రోజుల పాటు శవాన్ని బాక్స్‌లోనే ఉంచాల్సి వస్తోంది. ఫ్రిజర్‌ బాక్సులన్నీ శవాలతో నిండిపోవడంతో ఆ తర్వాత వచ్చిన వాటిని వార్డులో ఓ మూల పడేయాల్సి వస్తోంది. వస్తున్న శవాల నిష్పత్తికి తగ్గట్టు మార్చురీని అభివృద్ధి చేయకపోవడం.. ఎప్పటికప్పుడు శవాలను దహనానికి తరలిం చకపోవడం ఇందుకు కారణాలని వైద్యనిపు ణులు చెపుతున్నారు.

ఉస్మానియా మార్చురీ మూసీ నదిని ఆనుకుని ఉంది. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఏళ్ల తరబడి భవనానికి మరమ్మతులు నిర్వహించక పోవ డంతో పందికొక్కులు, ఎలుకలు, కుక్కలకు నిలయంగా మారింది. వీటిని నియంత్రించా ల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. నిజానికి ఫ్రీజర్‌ బాక్స్‌లో భద్రపరిచిన శవాలను పందికొక్కులు, ఎలుకలు కొరికే అవకాశం లేదు. బాక్స్‌లో కాకుండా వార్డులో ఓ మూలన పడేస్తుండటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)