amp pages | Sakshi

సౌకర్యాలు లేకున్నా.. సత్తా చాటారు

Published on Wed, 04/29/2015 - 01:07

ఫలితాల్లో  జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచిన జఫర్‌గఢ్
{పభుత్వ జూనియర్ కళాశాల
ఎంపీసీలో 905 మార్కులు సాధించిన కళాశాల విద్యార్థి బాలాజీ
నూరు శాతం ఫలితాలు సాధించిన  వెలుగు గురుకుల పాఠశాల

 
జఫర్‌గఢ్ :  స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి స్థాయిలో వసతులు లేనప్పటికీ ఆధ్యాపకుల అంకిత భావం, విద్యార్థుల పట్టుదలతో ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు వచ్చారుు. కళాశాల ప్రారంభం నుంచి నేటి వరకు మౌళిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు సమస్యలతో సతమతమవుతూనే మరోవైపు ఏ ఏటికాయేడు ఫలితాల శాతం పెరుగుతూ వస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో  81 మంది విద్యార్థు లు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 73 మంది విద్యార్థులు  ఉత్తీర్ణులయ్యూరు. కళాశాల ఎంపీసీ విద్యార్థిని వీరబత్తిని బాలాజీ 905 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచా డు. బైపీసీలో రాధిక 850 మార్కులు సాధించ గా, సీఈసీలో ఆకుల అపర్ణ 795 మార్కులు సాధించారు.

వెలుగు గురుకుల కళాశాలలో  వంద శాతం ఉత్తీర్ణత

మండలంలోని ప్రభుత్వ వెలుగు గురుకుల కళాశాల విద్యార్థులు కూడా ఇంటర్ సెకండియర్‌లో తమ ప్రతిభ చాటారు. కళాశాలలో మొత్తం 73 మంది విద్యార్థులకు గాను 73 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బైపీసీలో జి.రమ 908 మార్కులు సాధించగా, ఎంపీసీలో పి.కళ్యాణి 873 మార్కులు సాధించారు. ఈ కళాశాలలో కూడా ప్రతి ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతూ వస్తోంది.
 జఫర్‌గఢ్ ప్రభుత్వ మోడల్ కళాశాల నుంచి 45 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 43 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీలో 882 మార్కులు  రాగా, బీపీసీ, సీఈసీ విభాగాల్లో 890 మార్కులు సాధించారు. గతంలో ఎన్నడూలేని విధంగా జూనియర్ కళాశాలతోపాటువెలుగు గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్ సెకండియర్‌లో ప్రతిభను చాటి ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ఫలితాలు సాధిం చడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రత్యేక తరగతులతోనే అత్యుత్తమ ఫలితాలు : దయాకర్‌రెడ్డి, జీజేసీ ప్రిన్సిపాల్

ఈ యేడు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. వీటి ఫలితంగానే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాస్ కావడమేగాక ఎక్కువ మార్కులు సాధించారు. పరీక్ష ఫలితాల్లో మా కళాశాల జిల్లాలోనే ద్వితీయ స్థానం రావడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది.
 
 అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఎక్కువ మార్కులు


రోజువారి తరగతులతోపాటు అధ్యాపకులు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వీటి ఫలితంగానే ఎంపీసీ విభాగంలో నాకు 905 మార్కులు వచ్చాయి. కళాశాలలో అధ్యాపకుల ప్రోత్సాహం ఎంతో బాగుంది.
 - బాలాజీ, ఎంపీసీ(905)
 
 వసతులు లేకున్నా విద్య బోధన బాగుంది

 కళాశాలలో పూర్తి స్థాయి వసతులు లేకున్నా అధ్యాపకుల విద్యా బోధన ఎంతో బాగుంది. వారి వల్లనే నేను ఎక్కువ మార్కులు సాధించా.
 - అపర్ణ
 సీఈసీ(795)
 
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)