amp pages | Sakshi

రౌడీషీటర్లపై ‘నయా’ నిఘా

Published on Fri, 05/10/2019 - 08:15

సాక్షి, సిటీబ్యూరో: ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న నగర పోలీసులు రౌడీషీటర్ల కదలికలపై సరికొత్త పర్యవేక్షణ వ్యవస్థను గురువారం అందుబాటులోకి తీసుకొచ్చారు. టీఎస్‌కాప్‌ అప్లికేషన్‌లో చేర్చిన ‘రౌడీ షీటర్స్‌ మాడ్యూల్‌’ బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో  నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రారంభించారు. ఠాణాల వారీగా రౌడీషీటర్ల పేర్లతో కూడిన డేటాను ప్రతి పోలీసు అధికారికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఫీల్డ్‌ ఆఫీసర్లు తమ యూజర్‌నేమ్‌తో లాగిపై రౌడీ షీటర్ల డాటాను తనిఖీ చేయవచ్చని, వారి ఫొటో లు కూడా అందుబాటులో ఉండటంతో ఏ సందర్భంలోనైనా గుర్తించే అవకాశం ఉందన్నారు. వారి నేరచరిత్ర పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటు ందని తెలిపారు. ఈ రౌడీషీటర్స్‌ మాడ్యూల్‌ వల్ల పెట్రోల్‌ కార్లు, బ్లూకోల్ట్స్‌ వారు ఉంటున్న చిరునామాలకు వెళ్లడంతో పాటు వారి కదలికలపై నిఘా ఉంచి వారి జియో–టాగ్‌ లోకేషన్‌ మ్యాప్‌లో పొందుపరచవచ్చన్నారు. జోన్‌లు, పోలీసు స్టేషన్ల వారీగా నివేదికలు పొందుపరిచిన టీఎస్‌కాప్‌ డ్యాష్‌బోర్డును సీనియర్‌ పోలీసులు పర్యవేక్షించవచ్చని సీపీ పేర్కొన్నారు. 

కంప్యూటర్లు, ప్రింటర్ల పంపిణీ...
నగర పోలీసు కమిషనరేట్‌ వ్యాప్తంగా ఈ–గవర్నెన్స్‌ అమలు చేస్తుండటంతో పోలీసు స్టేషన్‌లకు కంప్యూటర్లు, ప్రింటర్లను సీపీ అంజనీకుమార్‌ ఆయా అధికారులకు పంపిణీ చేశారు. ఆయా విభాగ సిబ్బంది ప్రతిపాదనల మేరకు 157 కంప్యూటర్లు, 35 ప్రింటర్లను అందజేశారు. ఈ 157 కంప్యూటర్లలో లా అండ్‌ అర్డర్‌ పోలీసు స్టేషన్లకు 65, ఏసీపీలకు 14, మెయిన్‌ పీసీఆర్‌కు 10 కంప్యూటర్లు అందించారు. మిగిలిన కంప్యూటర్లను ట్రాఫిక్, సిటీ సెక్యూరిటీ వింగ్, కార్‌ హెడ్‌క్వార్టర్స్, సీసీఎస్, స్పెషల్‌ బ్రాంచ్‌లకు అందించారు. కార్యక్రమంలో క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ అడిషనల్‌ సీపీ శికా గోయల్, లా అండ్‌ అర్డర్‌ అడిషనల్‌ సీపీ డీఎస్‌ చౌహన్, ఎస్‌బీ జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి, అన్ని జోన్ల డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌