amp pages | Sakshi

భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతుబీమా

Published on Wed, 09/05/2018 - 08:42

నల్లగొండ అగ్రికల్చర్‌ : ‘‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం భూమి ఉన్న ప్రతి రైతుకూ వర్తిస్తుంది. బాండ్‌లు రాలేదని దిగులుపడాల్సిన అవసరం లేదు. పాస్‌బుక్, ఆధార్‌ కార్డు, నామినీ ఆధార్‌ జిరాక్స్‌లను తీసుకెళ్లి మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలి. ఆన్‌లైన్‌లో నమోదు అయిన నాటి నుంచి రైతు బీమా వర్తిస్తుంది’’ అని జేడీఏ జి.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హలో జేడీఏ’ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు పట్టాదార్‌ పాస్‌బుక్కులు, రైతు బంధు చెక్కులు, బీమా పథకం, విత్తనాల పంపిణీపై ఉన్న సందేహాలను ‘జేడీఏ’తో ఫోన్‌లో మాట్లాడి నివృత్తి చేసుకున్నారు. ఎక్కువ మంది పట్టాదార్‌ పాస్‌బుక్కులు, రైతు బంధు చెక్కుల గురించే మాట్లాడారు. రైతుల ప్రశ్నలు, జేడీఏ సమాధానాలు వారి మాటల్లోనే...

  • ప్రశ్న : మట్టినమూనా పరీక్షలను ఎక్కడ చేయించాలి – మురళీయాదవ్, మిర్యాలగూడ
  • జేడీఏ : మిర్యాలగూడలోని భూసార పరీక్షాకేంద్రంలో మట్టినమూనాలను తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు.
  • ప్రశ్న : పాస్‌బుక్కు, చెక్కు రాలేదు – ఎల్లయ్య, పోలంపల్లి, చందంపేట
  • జేడేఏ : మీ తహసీల్దార్‌ను సంప్రదించండి, పాస్‌బుక్కు వచ్చిన తరువాత రైతుబంధు చెక్కును ఇప్పిస్తాం.
  • ప్రశ్న : పత్తిలో వేరుపురుగు వచ్చి చెట్లు చచ్చిపోతున్నాయి. ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
  • శ్రీనివాస్‌ మాడుగుల పల్లి
  • జేడీఏ : ట్రైకోడర్మవిరిడిని నీటిలో కలిపి చెట్టు వేర్ల దగ్గర తడిచే విధంగా పోయండి. సూక్మపోషకాలను పిచికారీ చేయండి. దీంతో పురుగు నాశనమవుతుంది.
  • ప్రశ్న : పాస్‌బుక్కు రాలేదు, బీమా వర్తిస్తుందా?
  • భిక్షం, మిర్యాలగూడ
  • జేడీఏ : మండల వ్యవసాయాధికారిని కలిసి ఆన్‌లైన్‌లో నమోదు చేయించండి. నమోదు అయిన నాటినుంచి బీమా వర్తిస్తుంది.
  • ప్రశ్న : రైతుబంధు చెక్కులు ఎప్పుడు వస్తాయి?
  • పల్లె క్రిష్ణయ్య, వేములపల్లి
  • జేడీఏ : పాస్‌ బుక్కులు వచ్చిన తరువాత రైతు బంధు చెక్కులు వస్తాయి.
  • ప్రశ్న : రైతు బీమా పధకానికి ఎక్కడ అన్‌లైన్‌ చేయించాలి?
  • అనికుమార్‌రెడ్డి, తిమ్మన్నగూడెం
  • జేడీఏ : మండల వ్యవసాయాధికారిని కలిసి పాస్‌బుక్కు జీరాక్స్, ఆధార్‌ కార్డుతో నామినిది కూడా జీరాక్స్‌ వస్తే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
  • ప్రశ్న : పాస్‌బుక్కు వచ్చి నెల రోజులు అయ్యింది. ఇప్పటికీ రైతుబంధు చెక్కు రాలేదు.
  • యాదయ్య, తొండ్లాయి, శంకర్, 
  • నల్లగొండ, ఘనీ, హాలియా
  • జేడీఏ : త్వరలోనే చెక్కు వస్తుంది.
  • ప్రశ్న : పాస్‌బుక్కులు రాలేదు
  • సత్తిరెడ్డి ఉట్లపల్లి, వెంకటయ్య, బొల్లెపల్లి, వెంకటేశ్వర్లు, సిరసనగండ్ల
  • జేడీఏ : తహసీల్దార్‌ను, లేదా ఆర్‌డీఓలను కలవండి. బుక్కులు వచ్చిన తరువాత చెక్కులను ఇప్పిస్తాం.
  • ప్రశ్న : రబీలో సబ్సిడీ విత్తనాలు ఇస్తారా
  • శ్రీను, మునుగోడు
  • జేడీఏ : వేరుశనగ, మినుము, ఉలువులు సబ్సిడీపై ఇస్తాం
  • ప్రశ్న : రుణమాఫీ రాలేదు
  • సుజాత, కట్టంగూరు
  • జేడీఏ : ప్రభుత్వానికి నివేదికను పంపించాం. ప్రభుత్వంనుంచి ఆమోదం వస్తే రుణమాఫీ వస్తుంది.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?