amp pages | Sakshi

కొందరికే.. పెట్టుబడి

Published on Thu, 10/25/2018 - 12:02

సాక్షి, జనగామ: యాసంగి పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతోంది.  మొదటి దఫా డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వ్యవసాయశాఖ అధికారులు జమ  చేశారు. మొదటి దఫాలో కేవలం 3,915 మంది రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ చేశారు. రెండో విడత చెల్లింపు ల కోసం రైతుల ఖాతా నంబర్లు సేకరిస్తున్నారు.  ముం దస్తు ఎన్నికల నేపథ్యంలో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని నగదు రూపంలో చెల్లిం చడానికి వీలులేదని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసిం ది. దీంతో చెక్కుల రూపంలో  కాకుండా రైతుల అకౌంట్లలో పెట్టుబడి సా యం జమ చేయాలని సూచించడంతో ఈ మేరకు అధికా రులు చెల్లింపుల ప్రక్రియను చేపట్టారు.

తొలి విడతలో రూ.4.65 కోట్లు జమ..
ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం కింద రైతులకు  అందించడానికి రైతుబంధు పథకానికి ప్రభుత్వం శ్రీకా రం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో తొలివిడత రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. రెండో పంటకు అక్టోబర్‌లో చెక్కులను అందించాల్సి ఉండగా ఇంతలో శాసనసభను రద్దు చేశారు. ఎన్నికల కోసం సన్నాహాలు జరుగుతుండడంతో రైతుబంధు చెక్కులను పంపిణీని నిలిపివేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నేరుగా రైతుల అకౌంట్లలో పెట్టుబడి  సాయం జమ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి దఫాలో 13 మండలాల్లోని 3,915 మంది రైతులకువారి అకౌంట్లలో రూ.4,65,69,240 ను జమ చేశారు.

రెండో విడతలో రూ.26.82 కోట్లు..మొదటి  దఫాలో తక్కువ మంది రైతులకే పెట్టుబడి సాయం జమ చేశారు. నవంబర్‌ మొదటివారంలో రెండో దఫా పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్నారు. ఇందులో 22,109 మంది రైతులకు పెట్టుబడి సాయం అందజేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారికి రూ.26,82,52,460 చెల్లించనున్నారు.

అకౌంట్ల సేకరణకు ఇక్కట్లు..
రైతుల బ్యాంకు అకౌంట్ల సేకరణలో అధికారులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలోని 68 క్లస్టర్లల్లో ఏఈఓలు ఇంటింటా రైతు వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా, మండలం, గ్రామం, రైతు పేర్లతోపాటు ఆధార్‌ నంబర్, బ్యాంకు, బ్రాంచి, అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లతోపాటు 9 అంశాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఏఈఓలు గ్రామాలకు వెళ్తున్నప్పటికీ రైతులు అందుబాటులో లేకపోవడంతో వివరాలు సేకరించలేక పోతున్నారు.
 
ఖరీఫ్‌లో 6,829 చెక్కులు వాపస్‌.. 
జిల్లావ్యాప్తంగా 1,54,658 చెక్కులు రైతుల పేరుమీద వచ్చాయి. అయితే వివిధ కారణాలతో ప్రభుత్వం తిరిగి 6,829 చెక్కులను తీసుకుంది. మిగతా 1,47,823 చెక్కుల్లో 1,32,870 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 75 వేల మంది రైతుల ఖాతాలను సేకరించారు. మరో 50 వేల మంది రైతుల వివరాలు తీసుకోవాల్సి ఉంది. రైతుల వివరాలు లేకపోతే రైతుబంధు సాయాన్ని జమ చేయడం మరింత ఆలస్యం కానుంది.

75 వేల ఖాతాలను సేకరించాం
యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని మొదటి విడత రైతుల అకౌంట్లలో జమ చేశాం. రెండో విడత కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 75 వేల అకౌంట్లను సేకరించాం. మిగతా రైతుల వివరాలను సేకరిస్తున్నాం. అందరికి డబ్బులు వచ్చేలా ప్రయత్నిస్తాం. –ఎన్‌.వీరూనాయక్, డీఏఓ 

Videos

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)

ఏపీకి మళ్లీ జగనే సీఎం: KCR

పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)