amp pages | Sakshi

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం

Published on Tue, 02/23/2016 - 03:28

సాక్షి నిఘా
* చల్లదనంలో ఉంచాల్సిన పోలియో వ్యాక్సిన్ కిట్లు గ్రామాల్లోనే..
* ఆ వ్యాక్సిన్ వేస్తే ..వికటించే ప్రమాదమంటున్న ఆరోగ్య సిబ్బంది
* రవాణా ఖర్చులు మింగుతున్న వైనం
* కొరవడిన అధికారుల పర్యవేక్షణ

తిప్పర్తి: పోలియో రహిత సమాజ స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు పర్యాయాలు పల్స్‌పోలియో చుక్కలు వేసే విధంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది. వైద్య, ఆరోగ్య సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంతో చిన్నారులకు ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది.

ఎప్పుడు చల్లదనంలో ఉండాల్సిన వ్యాక్సిన్లను (కిట్) ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ, ఆశ వర్కర్ల వద్దనే ఉంచుతున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రతి రోజు పీహెచ్‌సీ నుంచి కిట్లను తీసుకొని వాహనాల ద్వారా ఆయా గ్రామాలకు పంపిణీ చేయాలి. మొదటి రోజునే ఆ కిట్లను  ఇచ్చేసి 3వ రోజు తిరిగి వాటిని తెస్తున్నారు. దీంతో ‘‘వ్యాక్సిన్’’ వికటించే అవకాశం ఉంటుందని కొంతమంది ఆరోగ్య సిబ్బంది అంటున్నారు. కిట్లను సరఫరా చేసేందుకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను మింగేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
వ్యాక్సిన్ కూలింగ్ ఇలా...
పోలియో చుక్కల వ్యాక్సిన్‌ను ఎప్పుడు చల్లని ప్రదేశంలో భద్రపరచాలి. వ్యాక్సిన్ ఫ్రీజ్‌లో ఉంచి బయటకు తీసుకెళ్లెటప్పుడు కిట్ (డబ్బ)లో నాలుగు ఐస్‌ప్యాడ్‌ల నడుమ వ్యాక్సిన్ ఉంచి మరో ఐస్‌గడ్డల ప్యాకెట్‌లను రెండింటిని వేస్తారు. ఇలా ఐస్ ప్యాడ్స్‌లు ఢీ ఫ్రీజ్‌లో -2, -8 సెంటి డిగ్రీల చల్లదనంలో కూల్ అయిన తర్వాత కిట్‌లో ఉంచుతారు. దీంతో 8 గంటల వరకు ఈ చల్లదనం ఉంటుంది. పోలియో చుక్కలు వేసిన అనంతరం కిట్స్‌ను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ఢీ ఫ్రీజ్‌లో ఐస్ ప్యాడ్‌లను, వ్యాక్సిన్లను కూలింగ్ పెట్టి మరునాడు ఆయా గ్రామాలకు సరఫరా చేయాలి. ఇలా 3 రోజుల పాటు ఈ పోలియో చుక్కల వ్యాక్సిన్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూలింగ్ పెట్టాలి.
 
చల్లదనం లేకుంటే..
పోలియో వ్యాక్సిన్ తయారీ నుంచి పంపిణీ చేసేంత వరకు చల్లదనంలోనే ఉంటుంది. అయితే సరైన చల్లదనం లేనప్పుడు స్టేజీల వారీగా వి.వి.ఎం. శాతం పడిపోతుంది. అందులో 1వ, 2వ స్టేజీల వరకు పోలియో చుక్కలను చిన్నారులకు వేసుకోవచ్చు. తర్వాత స్టేజీలో ఆ చుక్కలు వేసిన పనిచేయకపోవడం, వికటించే అవకాశం ఉంటుంది.
 
రవాణా ఖర్చులు నొక్కేసేందుకే ?
పోలియో చుక్కల కార్యక్రమం 3 రోజులు మండల కేంద్రంలోని పీహెచ్‌సీ నుంచి కిట్లను ఆయా గ్రామాలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలోనే నిధులు వస్తాయని వాటిని కాజేసేందుకే ఇలా ఒక్క రోజు మాత్రమే కిట్స్ సరఫరా చేసి ఆయా గ్రామాలలోని అంగన్‌వాడీ, ఆరోగ్య సిబ్బందికి కిట్స్ ఇస్తున్నారు. దీంతో మొదటి రోజు - 2, -8 డిగ్రీల చల్లదనంతో ఇచ్చిన ఐస్‌ప్యాడ్లు కరిగి నీరుగా మారి కూలింగ్ శాతం తక్కువ అవుతుంది.

ఇలా కిట్లను తమవద్దనే ఉంచుకునేందుకు కొంత మంది అంగన్‌వాడీ వర్కర్లు సంసిద్ధత వ్యక్త చేస్తున్నా పట్టించుకోకుండా వైద్యాధికారులు, సిబ్బంది అలాగే వదిలేసి వెళుతున్నారు. దీంతో ‘‘వ్యాక్సిన్’లో వి.వి.ఎం. (వ్యాక్సిన్, వైల్, మానిటర్) శాతం తక్కువై ఆ చుక్కలు వేసినా ఉపయోగం ఉండకపోవడంతో పాటు వికటించే అవకాశం ఉంటుంది.
 
ఓ ఉద్యోగి కనుసన్నల్లోనే..
మండల కేంద్రంలో పనిచేసే ఓ సూపర్‌వైజర్ ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో మొత్తం 50 పోలియో చుక్కల బూత్‌లు ఉండగా వాటిని 5 రూట్లుగా విభజించి సూపర్‌వైజర్లు ప్రతి రోజు ఆయా బూత్‌లకు వ్యాక్సిన్ కిట్లను తీసుకువెళ్లాలి. కానీ రవాణా ఖర్చులను నొక్కేసేందుకు ఓ సూపర్‌వైజర్ ఒక్క రోజు కిట్లను ఇచ్చేసి చివరి రోజు తెచ్చుకునేలా రెండు ఆటోలను మాట్లాడినట్లు తెలిసింది. అయితే పర్యవేక్షించాల్సిన వైద్యాధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా జిల్లా మొత్తంలో కూడా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కొంతమంది అంగన్‌వాడీలు, ఆరోగ్య సిబ్బంది అంటున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)