amp pages | Sakshi

19 నెలల్లో 1,900 కోట్లు ఆదా

Published on Sat, 03/24/2018 - 02:17

సాక్షి, హైదరాబాద్‌: పౌర సరఫరాలశాఖలో సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 19 నెలల క్రితం ఆ శాఖ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించాక సంస్కరణలు మొదలయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన చేపట్టిన సంస్కరణలు పలువురి ప్రశంసలు పొందాయి. ఆన్‌లైన్‌ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, చెల్లింపులు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, గోదాముల్లో సీసీ కెమెరాలు, టీ–రేషన్‌ యాప్, రేషన్‌ షాపుల్లో ఈ–పాస్‌ యంత్రాలు, జిల్లాల్లో మినీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు, రేషన్‌ పోర్టబిలిటీ వంటి చర్యలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయి. ఈ సంస్కరణలతో 19 నెలల్లో ఏకంగా రూ. 1,900 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా జరిగింది. నిఘా బృందాలతో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు.

కాకినాడ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణాకు ముగింపు పలికారు. అక్రమంగా రేషన్‌ బియ్యం అమ్ముకుంటున్న ఆరుగురు వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపించారు. రేషన్‌ సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్‌ యంత్రాలను అమర్చారు. 171 గోదాముల్లో 17,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని జిల్లా కేంద్రాల్లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు, హైదరాబాద్‌లోని కేంద్ర కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించి బియ్యం అక్రమ రవాణా, గోదాముల్లో అక్రమాలకు చెక్‌ పెట్టారు. రేషన్‌ లబ్ధిదారులు తమ జిల్లాలో ఎక్కడి నుంచైనా రేషన్‌ సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని తీసుకొచ్చారు.

త్వరలో రాష్ట్రంలో ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని విస్తరించనున్నారు. రాష్ట్రంలో 17,200 రేషన్‌ షాపుల్లో ఈ–పాస్‌ యంత్రాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 800 కోట్ల వరకు ఆదా అవుతోంది. కార్డుదారులకు త్వరితగతిన సరుకులు అందించడానికి వీలుగా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌లో కనీస మద్దతు ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు, చెల్లింపుల విధానం ప్రాచుర్యం పొందింది. 2016–17 ఖరీఫ్, రబీ, ఈ ఏడాది ఖరీఫ్‌లో 15 లక్షల మంది రైతుల నుంచి రూ. 11 వేల కోట్ల విలువ చేసే 72 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

సాంకేతికతతో అక్రమాలకు అడ్డుకట్ట వేశాం 
రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు బయోమెట్రిక్, సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సత్ఫలితాలను సాధించాం. సరుకుల సరఫరా నుంచి పంపిణీ వరకు మొత్తం ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. అర్హులైన పేదలందరికీ సక్రమంగా సరుకులు అందివ్వగలుగుతున్నాం. సాంకేతికతతో అక్రమాలను అరికడుతూనే నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. 
– సీవీ ఆనంద్, పౌర సరఫరాలశాఖ కమిషనర్‌

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)