amp pages | Sakshi

సమైక్యంగా ఉద్యమిద్దాం

Published on Sun, 01/06/2019 - 00:44

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికలతోనే బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆగిపోదని, భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ల కోత తప్పదని పలువురు నాయకులు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు, హక్కులకై పార్టీలకతీతంగా జెండాలు పక్కనపెట్టి బీసీలు సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకుని టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని, ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజలను చైతన్యం చేయా లని బీసీ సంఘాలు, కుల సంఘాలను కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపును నిరసిస్తూ తెలంగాణ జన సమితి బీసీ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద నిరాహా రదీక్షలు నిర్వహించారు. దీక్షలను ప్రారంభించిన జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని చెప్తున్న సీఎం, పంచాయతీ ఎన్ని కల్లో ఇప్పటివరకు అమలు అవుతున్న 34% రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు 50% దాటవద్దనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీసీ సంఘాలు, కుల సంఘాలు ఎవరి సంఘం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప బీసీలను సంఘటితం చేద్దా మనే చిత్తశుద్ధి కనబడడంలేదని వాపోయారు.

టీజే ఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ, రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ తగ్గింపు పంచాయతీ ఎన్నికలకే పరిమితం కాదని, రానున్న అన్ని ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందన్నారు. రిజర్వేషన్లు ఆత్మగౌరవ హక్కుగా గుర్తించి దాన్ని కాపాడుకునేందుకు బీసీలు ఉద్యమించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ, మంత్రివర్గం లేకుండానే బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ తేవడం శోచనీయమన్నారు. కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్లు తగ్గించారని.. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్య త్వ రద్దుపై రూ. 50 లక్షలు ఖర్చుచేసి, పెద్దపెద్ద అడ్వొకేట్లతో కోర్టులో వాదించిన ప్రభుత్వం రిజర్వేష న్ల తగ్గింపుపై మాత్రం స్థానిక అడ్వొకేట్‌లతోనే సరిపె ట్టిందన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ బీసీ రిజర్వేషన్లు తగ్గించే ఆర్డినెన్స్‌పైనే తొలి సంతకం చేయడం ద్రోహం చేయడమేనన్నారు.

ఆర్డినెన్స్‌ తేవడం దుర్మార్గం: దాసోజు
కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ దళితులు సామాజిక అంటరానితనానికి గురవుతుంటే, బీసీలు రాజకీయ అం టరానితనానికి గురవుతున్నారన్నారు. అసెంబ్లీలో, అఖిలపక్షంతో, కుల, బీసీ సంఘాలతో చర్చించకుండా బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ తేవడం దుర్మార్గమన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఎందుకుండకూడదని అన్న కేసీఆర్‌ బీసీ రిజర్వేషన్లు 22 శాతంకు తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావడం అన్యాయమన్నారు. సీపీఐ నాయకులు సుధాకర్, కాంగ్రెస్‌ నాయకులు వినయ్‌కుమార్, సీపీఐ (ఎంఎల్‌) నాయకురాలు ఝాన్సీ, టీజేఎస్‌ నాయకులు గాదె ఇన్నయ్య, కె.దిలీప్‌కుమార్, పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)