amp pages | Sakshi

ఇంకా ఏపీ సింబలేనా !

Published on Fri, 07/04/2014 - 02:13

 మోర్తాడ్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నెల రోజులు అవుతున్నా రెవెన్యూ అధికారులు మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్‌లలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాజ ముద్రనే దర్శనమిస్తోంది. ఆదాయం, కులం, నెటివిటీ త దితర ధ్రువీకరణ పత్రాలతోపాటు  పహాని ఇతరత్రా సర్టిఫికెట్‌లు అన్ని మీ సేవ కేంద్రాల ద్వారానే జారీ  చేయబ డుతున్నాయి. సర్టిఫికెట్‌ల కోసం దరఖాస్తుదారులు మీ సేవ కేంద్రాలలో సంప్రదించి అవసరమైన జిరాక్సు కాపీలను అందచేస్తే రెండు మూడు రోజుల వ్యవధిలో సర్టిఫికేట్‌లు జారీ అవుతాయి.

మీ సేవ కేంద్రాలకు జారీ చేసిన స్టేషనరీ పాతది కావడంతో పత్రాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పూర్ణ కుం భం తో కూడిన రాజ ముద్రనే ఉంది. తె లంగాణ ప్రభుత్వం కొత్త రాజ ముద్ర ను ఆమోదింపచేసింది. స్టేషనరీ గతంలో ప్రింట్ చేసింది కావడంతో రాజ ముద్ర లో ఎలాంటి మార్పు లేదు. కాగా సర్టిఫికెట్‌లపై తెలంగాణ ప్రభుత్వం అని ఉన్నా, రాజ ముద్ర విషయంలో మా ర్పులు చేయాల్సి ఉంది.

 రాజ ముద్ర మారక పోవడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్,  స్కాలర్‌షిప్పులు, ఇతర సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకుం టే ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని దరఖాస్తుదారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నెల రోజుల వుతున్నా  సర్టిఫికెట్‌ల స్టేషనరీలో మా ర్పులు చేయక పోవడంపై నిరసన వ్య క్తం అవుతోంది. మీ సేవ కేంద్రాల నిర్వా హకులు సర్టిఫికెట్‌లను జారీ చేయడానికి అవసరమైన స్టేషనరీని హై దరాబాద్‌లోని మీ సేవ కేంద్రాల కంట్రోల్ రూంకు ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్  ఉంచితే, డ బ్బులు కట్ అవుతాయి.

 దీంతో హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రానికి స్టేషనరీ సరఫరా అవుతుంది. ఆ తరువాత ని ర్వాహకులు తెప్పించుకోవాల్సి ఉంటుం ది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాైటై న వెంటనే స్టేషనరీని మార్చాల్సి ఉంది. అధికారులు పట్టించుకోక పోవడం తో ఏపీ రాజ ముద్రతోనే సర్టిఫికెట్ లు జా రీ అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారు లు స్పందించి  సర్టిఫికెట్‌లపై తెలంగా ణ రాజ ముద్ర ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
 

Videos

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?