amp pages | Sakshi

మధ్యాహ్న భోజనంపై ‘లెక్క’లేనితనం!

Published on Mon, 08/21/2017 - 02:17

పాఠశాలల్లో విద్యార్థుల లెక్కలు సరిగ్గా ఇవ్వని టీచర్లు
రోజువారీగా భోజనం తినే విద్యార్థుల లెక్కలపై కేంద్రం అసంతృప్తి


సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థుల వివరాలను టీచర్లు ఇవ్వడం లేదు. రోజువారీగా పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు భోజనం తింటున్నారు.. ఎంత మంది గైర్హాజర్‌ అవుతున్నారో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్‌ మానిటరింగ్‌ సిస్టం రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు కావడంలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ చీవాట్లు పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో 28,689 పాఠశాలలు ఉన్నాయి.

వీటిల్లో ఎన్ని పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారన్న వివరాలను మధ్యాహ్న భోజనం బాధ్యతలు చూసే టీచర్లు సరిగ్గా పంపించడం లేదు. దీంతో గత నెల, ఈ నెలలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో ఆటోమేటెడ్‌ మానిటరింగ్‌ సిస్టం అమలు కావడం లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నెల 12, 14 తేదీల్లో 2 శాతం పాఠశాలలు కూడా మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థుల సంఖ్యను తెలియజేయలేదని పేర్కొంది. ఇప్పటికైనా సరిగ్గా వివరాలను పంపించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

ఇతర రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి..
వివిధ రాష్ట్రాల్లోనూ మధ్యాహ్న భోజనం లెక్కలు కేంద్రానికి సరిగ్గా అందడం లేదు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉండే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో నిధులకు పక్కాగా లెక్కలు ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం ఆటోమేటెడ్‌ మానిటరింగ్‌ సిస్టంను ప్రవేశ పెట్టింది. ఈ నెల 12వ తేదీన మన రాష్ట్రంలోని 473 పాఠశాలల నుంచి (1.65 శాతం) మాత్రమే భోజనం చేసిన విద్యార్థుల వివరాలు కేంద్రానికి వెళ్లాయి. ఈ నెల 14న కేవలం 232 పాఠశాలలు మాత్రమే ‘భోజనం’ వివరాలను ఇచ్చాయి.

Videos

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?