amp pages | Sakshi

ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం..

Published on Sat, 12/08/2018 - 03:07

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రా (ఈవీఎం)ల్లో నిక్షిప్తమైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ సమయం ముగిసే సమయానికి రాష్ట్రంలో సుమారుగా 67.7% పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. కచ్చిత మైన గణాంకాలను శనివారం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ పేర్కొన్నారు.

2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 69.5 % పోలింగ్‌ నమోదుకాగా ఈసారి కూడా అంతే స్థాయిలో పోలింగ్‌ నమోదు కావచ్చునన్నారు. 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగియగా మిగిలిన 106 స్థానాల్లో 5 గంటలకు ముగిసింది. పోలింగ్‌ ముగిసే సమయానికి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని లైన్లలో నిలబడిన ఓటర్లకు అదనపు సమయంలో ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 11న ఫలితాలను ప్రకటించనున్నారు. 

గంట ఆలస్యంగా ప్రారంభం... 
షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సా యంత్రం 4 లేదా 5 గంటల వరకు పోలింగ్‌ జరగా ల్సి ఉండగా ఈవీఎంలు మొరాయించడంతో చాలా ప్రాంతాల్లో దాదాపు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ కేం ద్రాల్లో ఉదయం 6 నుంచి 6.45 గంటల మధ్య మాక్‌ పోలింగ్‌ నిర్వహించి ఈవీఎంల పనితీరును పరీక్షించిన అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. మాక్‌ పోలింగ్‌లో ఈవీ ఎంలతోపాటు ఓటర్‌ వెరిఫయబుల్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీప్యాట్‌) యంత్రాలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. 

చెదురుమదురు ఘటనలు మినహా... 
చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. నాలుగైదు చోట్ల  స్వల్ప ఘర్షణలతో ఉద్రిక్తత ఏర్పడినా పోలీసులు సకాలంలో రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. దీంతో ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. పోలింగ్‌ ముగిసే సమయానికి లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు కల్పించేందుకు కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగించారు. పోలింగ్‌ విధుల్లో 37,594 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 37,556 మంది సహాయక ప్రిసైడింగ్‌ అధికారులు, 74,873 మంది ఇతర పోలింగ్‌ అధికారులు కలిపి మొత్తం 1,50,023 మం ది సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్‌ ముగిసిన అనంత రం పోలింగ్‌ అధికారులు కట్టుదిట్టమైన భద్రత మ« ధ్య ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు.

భారీగా ఓట్లు గల్లంతు!
ఓటర్ల జాబితాలో అడ్డగోలుగా పేర్లను తొలగించడంతో శాసనసభ ఎన్నికల్లో లక్షల మంది పౌరు లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఓటరు గుర్తింపు కార్డులతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ప్రజలకు ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవని అధికారులు చెప్పడంతో తీవ్ర నిరసన తెలియజేశారు. ప్రధానంగా హైదరాబాద్‌ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతయ్యాయని ఫిర్యాదులొచ్చాయి. ఓటర్ల జాబితాలను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయడానికి 2015లో నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్‌ ఓటర్ల జాబితా సవరణ (ఐఆర్‌ఈఆర్‌) కార్యక్రమంలో భాగంగా బోగస్‌ ఓటర్ల పేరుతో దాదాపు 20 లక్షల మంది పేర్లను తొలగించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఓటర్ల పేర్ల తొలగింపులో పొరపాట్లు జరిగాయని సీఈఓ రజత్‌కుమార్‌ అంగీకరించారు.

ఓటు హక్కు వియోగించుకున్న ప్రముఖులు
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)