amp pages | Sakshi

జిల్లా యంత్రాంగం పనితీరు భేష్‌

Published on Tue, 09/25/2018 - 10:00

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ముం దస్తు ఎన్నికల ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం పనితీరు బాగుందంటూ ప్రత్యేక పరిశీలకుడు ఎల్‌.శశిధర్‌ కితాబిచ్చారు. జిల్లాలో బూత్‌లెవెల్‌లో ఓటర్‌ నమోదుకు చేపడుతున్న కార్యక్రమాలను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీలు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శశిధర్‌ మాట్లాడుతూ ఎన్నికల ఎర్పాట్లపై జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. ఓటరు నమోదుకు విస్తృత ప్రచారం కల్పించడంలో జిల్లా యంత్రాంగం కృషి అభినందనీయమన్నారు.
కాగా, ఓటరు నమోదు, చేర్పులు, మార్పులకు గడువు పొడిగించాలని నాయకులు కోరగా.. ఈ విషాయిన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తానని తెలిపారు.

కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ మాట్లాడుతూ బూత్‌లెవెల్‌ ఏజెంట్లను నియమించుకోవాలని రెండేళ్లుగా కోరుతున్నా పార్టీలు అలా చేయలేదని.. అదే జరిగితే ఓటరు నమోదు, చేర్పులు, మార్పులకు ఎంతో సులువయ్యేదని తెలిపారు. సమావేశంలో జేసీ ఎస్‌.వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లుతో పాటు వివిధ పార్టీల నాయకులు రంగారావు, పద్మజారెడ్డి, హాదీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని కాల్‌సెంటర్‌ను ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు శశిధర్‌ పరిశీలించారు.

ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలి 
భూత్పూర్‌ (దేవరకద్ర) : ఓటరు నమోదును పకడ్బందీగా   చేపట్టాలని   జిల్లా ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు శశిధర్‌ సూచించారు. భూత్పూర్‌ మున్సిపాలిటీ   పరిధిలోని   అమిస్తాపూర్‌ హరిజన్‌వాడలో   పోలింగ్‌  బూత్‌ను కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్, జెడ్పీ సీఈఓ శాంతకుమారితో కలిసి ఆయన పరిశీలించారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై తహసీల్దార్‌ జ్యోతిని అడిగి తెలుసుకున్నారు. 

 ఈవీఎం గోదాంలో పరిశీలన 
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : ఎన్నికల కమిషన్‌ నుండి జిల్లాకు కొత్తగా వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరుపై సోమవారం డెమానిస్ట్రేషన్‌ నిర్వహించారు. కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సమక్షంలో రాజకీయ పార్టీల నాయకులు వీటి పని విధానాన్ని స్వయంగా పరిశీలించారు. నాయకులు రంగారావు, అంజయ్య పాల్గొన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)