amp pages | Sakshi

ప్రాజెక్టులపై 'మహా' ఒప్పందం

Published on Tue, 08/23/2016 - 15:16

ముంబయి: తెలంగాణ, మహారాష్ట్ర  ప్రభుత్వాల మధ్య 'మహా' ఒప్పందం జరిగింది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్హౌస్లో జరిగిన  కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ, చనాక-కొరాట బ్యారేజీలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మూడు ఒప్పందాలపై కేసీఆర్, ఫడ్నవీస్ సంతకాలు చేశారు.  తాజా  ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది. మంత్రులు హరీశ్ రావు, జోగు రామన్న, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డితో పాటు మహారాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.

మొదటి ఒప్పందం: 16 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో గోదావరిపై 100 మీటర్ల ఎత్తుతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం.
ఆయకట్టు : కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కరీంనగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్,వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలు, 18 లక్షల ఎకరాల స్థిరీకరణ.

రెండో ఒప్పందం: 1.85 టీఎంసీ నీటినిల్వ సామర్థ్యంతో ప్రాణమితపై తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం
ఆయకట్టు: ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్-కాగజ్ నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలు.

మూడో ఒప్పందం: 0.85 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో పెన్గంగపై 213 మీటర్ల ఎత్తులో చనాఖ-కొరాట బ్యారేజీ నిర్మాణం.
ఆయకట్టు: ఆదిలాబాద్ జిల్లా తాంసి, జైనథ్, బేలా మండలాల్లో 50 వేల ఎకరాలు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)