amp pages | Sakshi

‘షేడ్‌నెట్’తో.. కాలం కలిసొస్తుంది!

Published on Sun, 11/02/2014 - 23:26

భాస్కర్‌రెడ్డి

సాధారణ పద్ధతిలో నారు పెంచితే...
  సాధారణ పద్ధతిలో పెంచే నారును పశువులు, గొర్రెలు, మేకలు మేసే ప్రమాదం ఉంటుంది.
  దీనికి రైతు కాపలా ఉండాల్సి వస్తుంది.
   ఏ తెగులు ఎలా వస్తుందో తెలుసుకోవడం కష్టం.
   మురుగు నీరు పారే వసతి (నీరు ఇంకిపోయే గుణం) నారుమడుల్లో ఉండకపోవడం వల్ల నారు కుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది.
   విత్తనాలు దగ్గర దగ్గరగా వేయడం వల్ల నారు ఒత్తుగా పెరిగి బలంగా ఉండదు.
  దీన్ని పొలంలో నాటిటే మొక్కలు వంగిపోయి చనిపోతాయి.  
  నారును బహిరంగ ప్రదేశాల్లో పెంచడం వల్ల తామర, పేనుబంక, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగు ఆశించి పాడవుతుంది.
  నారును పొలం నుంచి పీకినప్పుడు పీచువేర్లు తెగిపోయి వేర్లతో సహా మట్టి తక్కువగా ఉండడం లేదా పూర్తిగా లేక పోవడంవల్ల నాటిన తర్వాత మొక్కలు చనిపోయి పొలంలో ఖాళీలు ఏర్పడుతాయి.
మళ్లీ మొక్కలు నాటినా అవి పెరిగే వరకు చాలా సమయం పడుతుంది.  
 పొలంలో నాటడానికి 30 రోజులు ముందే విత్తనాలు సేకరించుకుని నారు పోసి కనీసం 26 నుంచి 40రోజుల వరకు నారు మడులను సంరక్షించాల్సిన వస్తుంది. మధ్యకాలంలో అనువైన వర్షాలు కురిసి అదును ఉన్నా నారు సాగు చేయడానికి పనికిరాదు.

 షేడ్‌నెట్ హౌస్‌తో ఉపయోగాలు..


 నర్సరీలలో నారును ట్రేలలో పెంచుతారు.
 
ముందుగా కొబ్బరి పీచులో విత్తనాలను పూడ్చడం వల్ల తగు మేర తేమ ఉండి మొలకశాతం పెరుగుతుంది. తద్వారా విత్తన మోతాదు తగ్గి ఖర్చు తగ్గుతుంది.
 
నారును ప్లాస్టిక్ ట్రేలలో పెంచడం వల్ల వేర్లు సమృద్ధిగా పెరిగి పక్క మొక్కకు సంబంధం లేకుండా ఎదుగుతాయి.
 
మొక్కలు ట్రేల నుంచి పెరిగినప్పుడు వేరు వ్యవస్థ దెబ్బతినకుండా కొబ్బరి పీచుతో సహా పూర్తిగా ఊడివస్తుంది.
 
ఈ మొక్కలను పొలంలో నాటినప్పుడు చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.
 
ఒక్కో ట్రే గుంత రెండున్నర సెంటీమీటర్లు ఉండటం వల్ల ప్రతి మొక్కకు నలువైపులా కావాల్సినంతా ఖాళీ ఉండి మొ క్కలు ధృడంగా పెరుగుతాయి. ఇలాంటి మొక్కలు పొలంలో నాటిన వెంటనే పెరుగుదల ప్రారంభం అవుతుంది.
 
మొక్కలు షేడ్‌నెట్‌హౌస్‌లలో పెరగడం వల్ల తగినంత వెలుతురు, గాలి, తేమ ఉండి మొక్కల పెరుగుదలతో అన్ని సమంగా ఉండి ప్రధాన పొలంలో త్వరగా నాటుకునే అవకాశం ఉంటుంది.
 
 షేడ్ నెట్ హౌస్‌ల చుట్టూ తెల్లటి ఇన్‌సెక్ట్ నెట్ ఏర్పాటు చేయడం వల్ల తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ వంటి వైరస్ తెగుళ్ల వ్యాప్తికి సహాయపడే రసం పీల్చే పురుగులు ఆశించడానికి అవకాశం ఉండదు.
 
 ఫలితంగా నాణ్యమైన, ఆరోగ్యవంతమైన నారు లభిస్తుంది.
 
ఈ షేడ్‌నెట్ మౌస్‌లలో పాముపొడ, చీడపీడలు నారు మొక్కలపై ఆశించే అవకాశం ఉండదు.
 
 పంట ఎప్పుడు సాగు చేసుకోవాలనుకున్నా నారు అప్పటికప్పుడు రెడీమేడ్‌గా అదును వచ్చిన వెంటనే సాగుకు అవకాశం ఉంటుంది.

 సాధారణ పద్ధతిలో ఖర్చు అధికం..
  ఎకరం పొలంలో పంటసాగుకు ముందుగా నారు మళ్లు తయారు చేసుకోవాలి.
   ఎత్తుబెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫ్రూడాన్ గుళికలు, వేప పిండి చల్లి విత్తనాలు చల్లుకోవాలి.
  రెండుమూడు సార్లు మందు పిచికారీ చేయాలి. ఈ సాధారణ పద్ధతికి గాను పెట్టుబడి మొత్తం రూ. 5వేలు అవుతుంది. ఎకరం కూరగాయల సాగుకు 12వేల మొక్కలు కావాలి. అయినా అందులో ఎన్ని చనిపోతాయో చెప్పలేని పరిస్థితి.

 షేడ్‌నెట్‌లలో..
  నారును ట్రేలలో పెంచుతారు.
  ఎలాంటి రోగ లక్షణాలు ఉండవు.
   అన్ని రకాల పిచికారీ మందులు వాడతారు.
  ఎకరం కూరగాయల సాగుకు 8వేల మొక్కలు సరిపోతాయి.
  ఏ మొక్కా చనిపోదు. నారు ఖర్చు మొక్కకు 30 పైసలు అయితే పెట్టుబడి రూ.2,400, నారు 40పైసలు అయితే పెట్టుబడి రూ. 3,200 అవుతుంది. సాధారణంతో పోల్చితే షేడ్‌నెట్‌హౌస్‌ల ద్వారా తక్కువ ఖర్చవుతుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌