amp pages | Sakshi

కాషాయం రెపరెపలు

Published on Tue, 01/06/2015 - 01:18

కేంద్రప్రభుత్వంతోనేస్మార్‌‌ట సిటీ సాధ్యం
బీజేపీ నగర బూత్ స్థాయి ప్రతినిధుల సమావేశంలో
రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించారు. వరంగల్ బీజేపీ అర్బన్ బూత్ కన్వీనర్లు, సబ్ డివిజన్ ఇన్‌చార్జీల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేసేందుకు మిషన్-32 లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
 -  వరంగల్ అర్బన్    
 
వరంగల్ అర్బన్ : చారిత్రక వరంగల్ నగర కార్పొరేషన్‌పై బీజేపీ రెండా రెపరెపలాడాలని.. ఈ విజ యమే రాష్ర్ట పరిపాలనకు నాందిగా మారేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ స్టేషన్ రోడ్డులోని మహేశ్వరి గార్డెన్‌లో బీజేపీ నగర బూత్ లెవల్ ప్రతినిధులు సదస్సు అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశాన్ని కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ సహసంఘటన ప్రధాన కార్యద ర్శి సతీష్ ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు వరంగల్ నగరం గుండెకాయ వంటిది కావడంతో కేంద్రప్రభుత్వం ఈ నగరాన్ని హెరిటేజ్ సిటీగా ఎం పిక చేసి అభివృద్ధికి నడుం బిగించిందని తెలి పారు. కేంద్ర ప్రభుత్వ సహ కారంతో స్మార్ట్‌సిటీ, నర్మ్ వంటి బృహత్తర పథకాలు మంజూరు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో రాష్ర్టంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. కాగా, హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్‌తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదో సీఎం కేసీఆర్ చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రశ్నిం చారు. కాగా, మజ్లిస్‌తో లోపాయికారికంగా ఒప్పందం కారణంగా నిజాంను సీఎం పొగుడుతున్నారని ఆరోపించారు.

పార్టీని బలోపేతం చేయాలి :  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్

ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ నగరం లో బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి సతీష్ సూచించారు. ప్రతి డివిజన్‌కు ఓ ప్రణాళిక, నగరానికి మరో ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. పుస్తకాలతో పాటు ఆన్‌లైన్ పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాలని, వచ్చే నెలలో 15వేల మందితో పార్టీ బూత్ లెవల్ సమావేశం ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర జాతీ య, రాష్ర్ట నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, జైపాల్, మంత్రి శ్రీనివాస్, కాసం వెంకటేశ్వర్లు, చాడ శ్రీనివాస్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, దొంతి దేవేందర్‌రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, శేషగిరిరావు, విజయలక్ష్మి, చాడ శ్రీనివాస్‌రెడ్డి, రాగమళ్ల పరేమశ్వర్, రావు అమరేందర్‌రెడ్డి, పద్మ, రావుల కిషన్, వంగల సమ్మిరెడ్డి, మాచర్ల సాంబయ్య, చింతల పల్లి రాంచంద్రారెడ్డి, సముద్రాల పరమేశ్వర్, ఎరుకాల రఘునారెడ్డి, బాకం హరిశంకర్ పా ల్గొన్నారు. కాగా, బీజేపీ సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షుడు కంటిపూడి సత్యనారాయణ ఇటీవల హత్యకు గురికాగా ఈ సమావేశంలో నాయకులు నివాళులర్పించారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌