amp pages | Sakshi

డిగ్రీ కాలేజీల్లో రిపోర్టింగ్‌ గడువు పెంపు

Published on Wed, 06/21/2017 - 02:12

ఈ నెల 24 వరకు కాలేజీల్లో చేరే అవకాశం
నేటి నుంచి జరగాల్సిన వెబ్‌ ఆప్షన్లు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా విద్యార్థులకు సమా చారం అందకపోవడంతో వారు కాలేజీల్లో చేరే (రిపో ర్టింగ్‌) గడువును ఉన్నత విద్యా మండలి పొడిగిం చింది. వాస్తవానికి విద్యార్థులు కాలేజీల్లో చేరే గడువు మంగళవారంతో ముగిసింది. అయితే సాంకేతిక సమ స్యతో ఆన్‌లైన్‌లో సీట్లు పొందిన విద్యార్థులందరూ కాలేజీల్లో రిపోర్టు చేయలేకపోయారు.

దీంతో ఈ గడు వును ఈ నెల 24 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి, డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల (దోస్త్‌) కన్వీనర్‌ వెంకటాచలం, కో–కన్వీనర్‌ మల్లేశ్‌ వెల్లడించారు. డిగ్రీలో లభించిన 1.41 లక్షల మంది విద్యార్థుల్లో సోమవారం నాటికి 83 వేల మంది అలా ట్‌మెంట్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అందులో 40 వేల మంది మాత్రమే కాలేజీల్లో రిపోర్టు చేసి, ప్రవేశాలను ఆన్‌లైన్‌లో కన్ఫర్మ్‌ చేసుకున్నారు. దీంతో అధికారులు పరిస్థితిని సమీక్షించి సాంకేతిక సమస్యల వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. దీంతో ప్రవేశాల గడువును పొడిగించారు. మంగళవారానికి సీట్లు పొందిన వారిలో 97 వేల మంది విద్యార్థులు అలాట్‌ మెంట్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసు కున్నారు. అందులో 60 వేల మంది విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేశారు.

ఇప్పుడే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వొద్దు
మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లోకి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయిం చుకోవాలని, ప్రిన్సిపాళ్లను సంప్రదించి ఆన్‌ౖ లెన్లో సీటు కన్ఫర్మేషన్‌ చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది. చివరి దశ కౌన్సెలింగ్‌ పూర్తి అయ్యే వర కు కాలేజీల్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వొద్దని, జిరాక్స్‌ కాపీలే ఇవ్వాలని పేర్కొంది.

ఫీజులను కూడా చివరి దశ కౌన్సెలింగ్‌ పూర్తయ్యే వరకు చెల్లించొద్దని వెల్ల డించింది. ముందుగా సీటు వచ్చిన కాలేజీలో ఒరిజి నల్‌ సర్టిఫికెట్లు ఇచ్చినా, ఫీజు చెల్లించినా రెండు, మూడు దశ కౌన్సెలింగ్‌లో స్లైడింగ్‌ ద్వారా మరో కాలే జీకి వెళ్లే వీలుండదని తెలిపింది. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ వర్తించే విద్యార్థుల నుంచి కూడా కొన్ని కాలేజీ లు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా ఫీజులను వసూలు చేస్తే ఆయా కాలేజీలపై కఠిన చర్యలు చేపడతామని, అవసరమైతే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.

రెండో దశ షెడ్యూలు వాయిదా..
ముందస్తు షెడ్యూలు ప్రకారం రెండో దశ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో చేరేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 17 నుంచి 20 వరకు విద్యార్థులు మీ సేవ కేంద్రాల్లో ఆధార్, బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌కు అవకాశం కల్పించింది. ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రకటించింది.

అయితే ప్రస్తుతం మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులకు కాలేజీల్లో చేరే గడువు పొడిగించినందున రెండో దశ షెడ్యూలు మొత్తాన్ని వాయిదా వేసింది. అయితే మంగళవారంతో అథెంటికేషన్‌ ముగిసినప్పటికీ ఇంకా మిగిలిపోయిన విద్యార్థులు ఈ నెల 24 వరకు మీసేవా కేంద్రాల్లో ఆధార్, బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ చేయించుకోవచ్చని వెల్లడించింది. రెండో దశలో రిజిస్ట్రేషన్, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)