amp pages | Sakshi

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Published on Fri, 01/02/2015 - 03:01

వర్ని: టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వర్ని మండలం శంకోరా గ్రామ పంచాయతీ పరిధిలోని ఆఫంది ఫారంలో ఆయన గురువారం ఆహారభద్రత పథకాన్ని ప్రారంభిం చారు. ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కొత్త సంవత్సరం తొలి రోజున నాలుగు పథకాలను ప్రభుత్వం అమలులోకి తెస్తోందని అన్నారు.

ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఉన్నవారందరికీ పరిమితి లేకుండా బియ్యం అందజేయడం, పాఠశాలలు, హాస్టళ్లలో సన్నరకం బియ్యం పంపిణీ, అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణులు, బాలింతలకు వన్ ఫుల్‌మీల్ పథకం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయన్నారు. జిల్లాలో ఆహారభద్రత పథకం కింద నెలకు 10,500 మెట్రిక్ టన్నులు, వసతి గృహాలకు 1,400 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నట్టు వివరించారు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై సంవత్సరానికి రూ. రెండు వేల కోట్ల అదనపు భారం పడుతున్నా, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు. జిల్లాలో 18 లక్షల మందికి ఈ పథకాన్నివర్తింప చేసినట్టు పేర్కొన్నారు. రేషన్ డీలర్లు ఎలాంటి ఫిర్యాదు లేకుండా, తరుగు చేయకుండా లబ్ధిదారులకు బియ్యం అందజేయాలని సూచిం  చారు. వృద్ధులు, వితం తువులకు రూ. 1000, విక లాంగులకు రూ. 1500 చొప్పున 2.13 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఏడాదికి రూ. నాలుగు వేల కోట్లు  కేటాయించామని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నందున అర్హులు ఫించన్ రాకుండా, ఆహర భద్రత కార్డు రాకుండా ఉండకూడదన్నారు. త్వ రలోనే అర్హులకు రూ. మూడున్నర లక్షలతో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. వీటికి పూర్తి సబ్సిడి ఉంటుందన్నారు. కొత్త కాలనీలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించండి
రైతుల రసాయనిక ఎరువుల వాడాకాన్ని తగ్గించాలని మంత్రి కోరారు. వీటిని ఎక్కువగా వాడడంతో భూసారం దెబ్బతింటోందన్నారు. సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని కోరారు. దీంతో పెట్టుబడులు తగ్గుతాయని అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఇటీవల పర్యటించినపుడు ఓ యువరైతు వంద ఎకరాలలో సేంద్రియ ఎరువులతో పండించడం గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, డీఎస్‌ఓ కొండల్‌రావు ఎంపీపీ చింగ్లీ బజ్యానాయక్, జడ్‌పీటీసీ సభ్యుడు విజయ భాస్కర్‌రెడ్డి, తహశీల్దార్ సోమేశ్వర్, ఎంపీడీఓ చందర్‌నాయక్, సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)