amp pages | Sakshi

ప్రారంభమైన టీఎస్ సిరీస్

Published on Thu, 06/19/2014 - 00:07

 సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో కొత్త సీరిస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల తరువాత రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో వాహనదారుల్లో ఆనందం వ్యక్తమైంది. మొన్నటి వరకు వాహనాల సిరీస్, కోడ్ విషయంలో స్పష్టత లేకపోవడంతో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారికి నిరీక్షణ తప్పలేదు. కొత్త సిరీస్ రిజిస్ట్రేషన్లకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాహనదారులు ఉత్సాహంగా ఆర్టీఏ కార్యాలయాలకు చేరుకున్నారు. మొదటి రోజైన బుధవారం గ్రేటర్ పరిధిలో 967 కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. విరామం తరువాత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో నగరంలోని ఖైరతాబాద్‌తోపాటు ఉప్పల్, అత్తాపూర్, మేడ్చెల్, సికింద్రాబాద్, మెహదీపట్నం తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారుల రద్దీ కనిపించింది.  

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మొట్టమొదటి నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0002’ను నగరంలోని రహమత్‌నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడపాటి శివారెడ్డి తన స్విఫ్ట్‌డిజైర్ కోసం సొంతం చేసుకున్నారు. మరో నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0003’ వేదాంత లైఫ్‌సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ‘టీఎస్ 09 ఈఏ 0004’ నెంబర్‌ను  ఎన్.సుధాకర్ అనే వ్యక్తి తన హోండా యాక్టీవాకు తీసుకున్నారు. కొత్త సిరీస్ ప్రారంభమైనప్పటికీ వాహనదారుల్లో సరైన అవగాహన లేక ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ కనిపించలేదు. సాధారణ ఫీజులు, తత్కాల్ ఫీజులపైనే  వాహనదారులు తమకు కావలసిన నెంబర్లను దక్కించుకున్నారు. ‘టీఎస్09 ఈఏ 369’ కోసం ఓ వాహనదారుడు రూ.70 వేలు వేలం ద్వారా చెల్లించగా ‘టీఎస్ 09 ఈఏ 18’ కోసం మరో వాహనదారుడు రూ.10 వేలు చెల్లించారు.
 
ఫ్యాన్సీ నెంబర్లు సర్కార్‌కే..
తెలంగాణ రాష్ర్టంలోని తొలి సిరీస్‌లో ఫ్యాన్సీ నెంబర్లను ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది. ప్రభుత్వ వాహనాల కోసం వీటిని వినియోగించనున్నట్టు రవాణా అధికారులు తెలిపారు. వాహనదారులు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ‘1, 11, 111, 6, 66, 666, 9, 99, 999’ వంటి నెంబర్లు సర్కార్ వాహనాలకే సొంతం కానున్నాయి. మొట్టమొదటి సిరీస్ కావడంతో ప్రభుత్వం ఈ నెంబర్లకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది.
 
పాత వాహనాలపై ప్రతిష్టంభన..
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనా పాత వాహనాలపై నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం తొలగిపోలేదు. ‘ఏపీ’ నుంచి ‘టీఎస్’కు మారిన దృష్ట్యా అన్ని వాహనాలు తప్పనిసరిగా ఇందుకు అనుగుణంగా నెంబర్ ప్లేట్‌లను సవ రించుకోవాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో జిల్లా కోడ్ నెంబర్లు కూడా మారిపోతాయి. ఈ అంశంపై స్పష్టతకు మరో వారం, పది రోజులు పట్టవచ్చని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ ర ఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. ‘టీఎస్‌తో రిజిస్ట్రేషన్ అయ్యే కొత్త వాహనాలకు మాత్రం ఎప్పటికప్పుడు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తీసుకునే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
 
రంగారెడ్డి పరిధిలో 482 రిజిస్ట్రేషన్లు
అత్తాపూర్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం 482 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సి.రమేశ్ తెలిపారు. అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో 116, ఇబ్రహీంపట్నంలో 174, ఉప్పల్‌లో 93, మేడ్చల్‌లో 99 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పారు.
 
ఉప్పల్‌లో టీఎస్ 08 సిరీస్..

ఉప్పల్: రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాహనదారులతో ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం కిక్కిరిసిపోయింది. టీఎస్ 08 ఈఏ 0001, ట్రాన్స్‌పోర్టు వాహనాల సిరీస్ టీఎస్ 08 యూఏ 0001తో ప్రారంభమయ్యాయి. ఉప్పల్ పారిశ్రామికవాడకు చెందిన దోషి జమ్స్ అండ్ జ్యువెలర్స్ పేరిట ‘టీఎస్ 08 ఈఏ 0001’ నెంబర్‌ను రూ. 50 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాడు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)