amp pages | Sakshi

మత్స్య సమాఖ్యకు రూ.వెయ్యి కోట్లు

Published on Sun, 05/07/2017 - 01:40

అంగీకారం తెలిపిన ఎన్‌సీడీసీ
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సమాఖ్యకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) రూ.వెయ్యి కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేర కు రాష్ట్ర పశుసంవర్థక శాఖకు లేఖ రాసింది. దీంతో రుణం విడుదలకు అవసరమయ్యే గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో రూ.600 కోట్లు ఎన్‌సీడీసీ రుణం కాగా, రూ.200కోట్లు కేంద్ర సబ్సిడీ, రూ. 200 కోట్లు లబ్ధిదారుల వాటా.

అయితే సబ్సిడీ రూ.200 కోట్లు రాకుంటే దీనిని కూడా రుణ రూపంలోనే తీసుకోవాల ని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్‌సీడీసీ నుంచి మంజూరైన రుణం నుంచి చేపల విక్రయానికి సొసైటీ సభ్యత్వం కలిగిన మత్స్యకారులకు మోపెడ్‌లు, ఆటోట్రాలీలు, హైజెనిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలను 75శాతం సబ్సిడీ పై ఇవ్వనున్నారు. ఇందుకు రూ.320 కోట్లు కేటాయించనున్నట్లు ఎన్‌సీడీసీ ఆమోదించిన ప్రతిపాదనల్లో ఉంది.

అలాగే మత్స్య సంపద పెం చేందుకు నీటి వనరుల అభివృద్ధి, చేప విత్తన క్షేత్రాలు, చేపల ఉత్పత్తి పెంపు, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎన్‌సీడీసీ రుణంలో కేటాయింపులు చేశా రు. ముఖ్యంగా మత్స్య సంఘాలకు రాష్ట్రవ్యాప్తంగా 250 రిటైల్‌ చేపల మార్కెట్ల నిర్మాణానికి రూ.25కోట్లు, 30 జిల్లాల్లో హోల్‌సేల్‌ మార్కెట్ల నిర్మాణానికి రూ.60 కోట్లు ఇవ్వనున్నారు. 10 చేపవిత్తన క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు రూ.50 కోట్లు వెచ్చిస్తారు. వంద శాతం సబ్సిడీపై సొసైటీల ఆధ్వర్యంలో చేప విత్తనాలకు, రొయ్య పిల్లల పెంపకానికి రూ.98 కోట్లు, జిల్లా యూనియన్ల ద్వారా 30 రిజర్వాయర్ల సమగ్ర అభివృద్ధికి రూ. 60 కోట్లు ఇవ్వనున్నారు. చేపలు పట్టేందుకు అవసరమైన తెప్పలు, వలల కోసం రూ.82 కోట్లు, 50 ఐస్‌ ప్లాంట్లకు రూ.12.50 కోట్లు కేటాయిస్తారు.

Videos

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)