amp pages | Sakshi

కాళేశ్వరం సందర్శనకు పర్యాటక ప్యాకేజీ

Published on Thu, 04/26/2018 - 02:40

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించేందుకు భారీగా జనం తరలివెళ్తున్న నేపథ్యంలో టూరిజం శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటక ప్రాంతాల ప్యాకేజీలో భాగంగా కాళేశ్వరం ప్యాకేజీని డిజైన్‌ చేసింది. హైదరాబాద్‌ నుంచి నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించే పర్యాటకులకు వీలుగా ఒకరోజు ప్యాకేజీని రూపొందించింది. ఈ మేరకు కాళేశ్వరం చీఫ్‌ ఇంజనీర్‌ నల్లా వెంకటేశ్వర్లుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఎండీ మనోహర్‌ లేఖ రాశారు. టూర్‌ ప్యాకేజీలో భాగంగా సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్‌హౌజ్, ప్యాకేజీ–6లోని టన్నెళ్లను సందర్శించేందుకు అనుమతి కోరారు. తమ వినతిపై వీలైనంత త్వరగా తమకు అనుమతులు ఇవ్వాలని విన్నవించారు.  

రెండు లక్షల మంది సందర్శకులు..: ప్రాజెక్టును ఇప్పటివరకు రెండు లక్షల మంది సందర్శించినట్లు నీటి పారుదల వర్గాల అంచనా. కేంద్ర జల సంఘం ఇంజనీర్లు, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్, రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్, టీఎస్‌పీఎస్సీ, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఎన్‌ఆర్‌ఐ బృందాలు ప్రాజెక్టును చూసొచ్చాయి. ఇక కౌన్సిల్‌ చైర్మన్‌ స్వామిగౌడ్‌ నేతృత్వంలో ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ నేతృత్వంలో కార్పొరేటర్లు, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్, గొంగిడి సునీత, గణేశ్‌ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి నేతృత్వంలో వందల సంఖ్యలో రైతులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వచ్చి ప్రాజెక్టును సందర్శించారు. సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో ప్రత్యేక ప్యాకేజీ టూర్‌ను నిర్వహించేందుకు పర్యాటక శాఖ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
 

Videos

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు

చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్

పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

Photos

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)