amp pages | Sakshi

పోటీలో ఉండే వారికే బీఫారం

Published on Wed, 02/27/2019 - 02:41

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కొత్త వ్యూహం అమలుచేసే యోచనలో ఉంది. గత ఎన్నికలకు భిన్నంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని బరిలో దింపే విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రావడంలేదు. అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో ఎవరికీ బీఫారం ఇవ్వకుండా.. పోటీలో ఉండే వారి లో ఒకరిని బలపరచాలని భావిస్తోంది. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కరికి టికెట్‌ ఇవ్వడం వల్ల మిగిలిన అభ్యర్థులను బలపరిచే సంఘాలు దూరమవుతాయని, దీనివల్ల లోక్‌స భ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బంది ఉంటుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఎమ్మెల్సీ ఫలితాలు ప్రతికూలంగా ఉంటే ఓటర్లలో ప్రతికూల అభిప్రాయం నెలకొంటుందని యోచిస్తోంది.

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌... వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 5న నామినేషన్ల ప్రక్రియ ముగి యనుంది. 22న పోలింగ్, 26న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కాగా, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గానికి పాతూరి సుధాకర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గానికి పూల రవీందర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరి పదవీ కాలం మార్చి 29తో ముగుస్తోంది.

2013లో ఈ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో పాతూరి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా, రవీందర్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం రవీందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు వీరిద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా బరిలో నిలవాలని భావిస్తున్నారు. వీరికి పోటీగా ఉపాధ్యాయ సంఘాల తరఫున పలువురు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఇలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. టీఆర్‌ఎస్‌ అవకాశమిచ్చి నా, ఇవ్వకున్నా పోటీలో ఉంటామని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇప్పటికే నిర్ణయించుకున్నా రు. దీంతో టీఆర్‌ఎస్‌ కొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఎవరో ఒకరికి బీ ఫారం ఇవ్వడం కాకుండా పోటీలో ఉండే ఒక అభ్యర్థిని బలపరచాలని భావిస్తోంది.

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు