amp pages | Sakshi

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కార్మికవర్గం అసంతృప్తి

Published on Thu, 10/30/2014 - 03:53

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు

 సిరిసిల్ల :
 తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కార్మికవర్గం అసంతృప్తితో ఉందని సీఐటీ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో సీఐటీ యూ జిల్లా మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై కార్మికలోకం ఎన్నో ఆశలు పెట్టుకుందని, మేనిఫెస్టో లో కూడా చాలా హామీలిచ్చారని పేర్కొన్నా రు. ఐదు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం కరెంటు కోతలు, కనీస వేతన చట్టం అమలు వంటి అంశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో గంటలు గంటలు చర్చలు జరిపిన సీఎం కేసీఆర్ కార్మిక సంఘాలతో ఇప్పటివరకు ఒక్క గంటైనా మాట్లాడలేదన్నారు.

ఎన్నో ఆశలతో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన కార్మికలోకం ఇప్పుడు నిరాశకు గురవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరలను పెంచగా, ప్ర స్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యజమానులకు అనుకూలమైన నిర్ణయాలు చేస్తోందన్నారు. కోరలు లేని కా ర్మిక చట్టాలను పటిష్టపరచాల్సి ఉండగా త్రై పాక్షిక కమిటీని ఏర్పాటు చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. తె లంగాణలో కార్మికుడికి కనీస వేతనం రూ.15000 ఉండేలా చట్టం చేయాలన్నారు. సింగరేణిలో అటెండర్‌కు సైతం రూ.35 వేలు జీతం ఉందని, శ్రమను నమ్ముకున్న కార్మికుల కు మెరుగైన జీతం ఇవ్వాలన్నారు.

సిరిసిల్ల నేత కార్మికులు ఆత్మగౌరవంతో బతికేవిధంగా పవర్‌లూం షెడ్లు నిర్మించి సాంచాలను బ్యాంకు రుణాలతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సిరిసిల్ల పట్టణంలో ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ముత్యంరావు, మూషం రమేశ్, పంతం రవి, శ్రీరాం సదానందం, గంగారం, గణేశ్, అజయ్ పాల్గొన్నారు.

Videos

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)