amp pages | Sakshi

గురుకులాల్లో 4,322 పోస్టులు

Published on Tue, 01/29/2019 - 01:52

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి కొత్త కొలువులు మంజూరయ్యాయి. వచ్చే ఏడాది ఈ సొసైటీ ద్వారా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి ఆదేశాలిచ్చింది. మొత్తం 4,322 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో గురుకుల పాఠశాలలకు సంబంధించి 4,284... మరో 38 బీసీ గురుకుల సొసైటీకి కేటాయించింది. ఈ పోస్టులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్లపాటు విడతల వారీగా భర్తీ చేసుకునేలా అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలు, సొసైటీకి మంజూరు చేసిన పోస్టుల్లో 3,717 పోస్టులు మాత్రమే రెగ్యులర్‌ పద్ధతిలో భర్తీ చేస్తారు. మిగతా 605 పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌లోనే నియమించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

వచ్చే ఏడాది 2,537 పోస్టులు... 
గురుకుల సొసైటీ, గురుకుల పాఠశాలలకు మంజూరు చేసిన 4,322 పోస్టుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2,537 పోస్టులు భర్తీ చేయనున్నారు.  2020–21లో 833 పీజీటీ పోస్టులు, 2021–22లో 119 ఫిజికల్‌ డైరెక్టర్లు, 2022–23లో 833 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. 

బీసీ గురుకుల సొసైటీకి మంజూరైన పోస్టులు 
రెగ్యులర్‌... 
కేటగిరీ    పోస్టులు 
డిప్యూటీ సెక్రటరీ    1 
అసిస్టెంట్‌ సెక్రటరీ    2 
రీజినల్‌ కో–ఆర్డినేటర్లు    10 
సూపరింటెండెంట్లు    2 
సీనియర్‌ అసిస్టెంట్లు    8 
జూనియర్‌ అసిస్టెంట్లు    5 

అవుట్‌సోర్సింగ్‌.. 
డాటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్‌    2 
డాటా ఎంట్రీ ఆపరేటర్‌    4 
ఆఫీస్‌ సబార్డినేట్‌    4  
బీసీ గురుకులాల్లో కేటగిరీల
వారీగా మంజూరైన పోస్టులు 
రెగ్యులర్‌... 
కేటగిరీ    పోస్టులు 
ప్రిన్సిపాల్‌    119 
జూనియర్‌ లెక్చరర్‌    833 
పీజీటీ    833 
టీజీటీ    1,071 
ఫిజికల్‌ డైరెక్టర్‌    119 
పీఈటీ    119 
లైబ్రేరియన్‌    119 
క్రాఫ్ట్‌/ఆర్ట్‌/మ్యూజిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌    119 
స్టాఫ్‌ నర్స్‌    119 
సీనియర్‌ అసిస్టెంట్‌    119 
జూనియర్‌ అసిస్టెంట్‌(టైపిస్ట్‌)    119 
అవుట్‌సోర్సింగ్‌... 
ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు    238 
ల్యాబ్‌ అటెండర్లు    238 
ఆఫీస్‌ సబార్డినేట్లు    119 
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)