amp pages | Sakshi

జన‘వర్రీ’!

Published on Wed, 09/26/2018 - 10:49

సాక్షి, సిటీబ్యూరో: ముందస్తు ఎన్నికల వల్ల రాజకీయ పార్టీలకు, నాయకులకు ఎలాంటి మేలు చేకూరనుందో కానీ.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం 2019లో జరుగుతాయని భావించి..కొంగొత్తగా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్న నవయువతకు మాత్రం ఓటు హక్కు చేజారిపోయింది. సాధారణంగా ప్రతియేటా ఓటరు జాబితా స్పెషల్‌ రివిజన్‌ పూర్తయ్యాక జనవరి నెలలో తుది జాబితాను వెలువరిస్తారు. జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారికి ఓటు హక్కు కల్పిస్తారు. వారు జనవరి కంటే ఆరు నెలలు ముందుగానే ఓటరుగా నమోదయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాబోయే సంవత్సరం జనవరి ఒకటో తేదీని ప్రామాణికంగా తీసుకొని ఓటు హక్కు  కల్పిస్తారు. ఎన్నికలు  ముందస్తుగా జరుగకుండా..నిర్ణీత వ్యవధిలో జరుగుతాయని భావించి 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలనే ఉత్సాహం కొద్దీ గత జూలై నుంచి దరఖాస్తు చేసుకున్న వారు నగరంలో ఎందరో ఉన్నారు.

ఎన్నికలు 2019లోనే జరిగేట్లయితే అలాంటి వారందరికీ ఓటరు గుర్తింపుకార్డు లభించి ఓటు వేసేవారు. కానీ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా షెడ్యూలును కూడా ముందుకు జరపడంతో అలాంటి వారు ఓటర్లుగా నమోదయ్యే అవకాశం లేకుండా పోయింది. 2018 జనవరి ఒకటోతేదీ నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తయిన వారికి మాత్రమే ఓటు హక్కు లభించేలా ప్రామాణిక తేదీని నిర్ణయించారు. దీంతో 2018 జనవరి 2వ తేదీనాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారినుంచి 2019 జనవరి ఒకటో తేదీనాటికి 18 ఏళ్ల వయసు నిండేవారందరికీ ఓటు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు, తాము కోరుకున్న శాసనసభ్యుల్ని ఎన్నుకునేందుకు వారంతా మరో ఐదేళ్లు ఆగాల్సిందే.

అలాంటి వారు నగరంలో దాదాపు రెండు లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా. ఎన్నికలకు ఇంకా సమయముంది కనుక తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చుననుకున్న వారి సంగతలా ఉంచి, ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తులు చేసుకున్నవారు హైదరాబాద్‌ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే 30 వేల మందికి పైగా ఉన్నారు. వీరిలో సెప్టెంబర్‌ మొదటి వారం వరకు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకున్నవారు దాదాపు 15 వేల మంది ఉన్నారు. వీరు కాక ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు ఇంకా ఎక్కువే ఉన్నట్లు అంచనా. వీరందరి దరఖాస్తుల్ని పెండింగ్‌లో పెట్టారు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు వారికి ఓటు హక్కు లభించదు కనుక పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది.విశ్వసనీయ  సమాచారం మేరకు హెదరాబాద్‌ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా ఓటు హక్కు కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నవయువత వివరాలిలా ఉన్నాయి.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)