amp pages | Sakshi

మళ్లీ జరగదు ‘మాసాయిపేట’!

Published on Tue, 06/05/2018 - 01:30

సాక్షి, హైదరాబాద్‌: కాపలాలేని లెవల్‌ క్రాసింగ్స్‌.. దశాబ్దాలుగా ప్రజలను బెంబేలెత్తిస్తున్న మృత్యు కుహరాలు. ఇప్పుడు ఈ పీడ నుంచి తెలంగాణ విముక్తి పొందింది. రాష్ట్రంలో ఇకపై కాపలాదారు లేని లెవల్‌ క్రాసింగ్స్‌ అనేవి కనిపించవు. మరో మాసాయిపేట దుర్ఘటన జరిగే ఆస్కారమే లేదు.  నాందేడ్‌ రైల్వే డివిజన్‌ పరిధిలోకి వచ్చే తెలంగాణ భూభాగంలోని 3 చోట్ల మినహా అన్ని ప్రాంతాల్లో రైల్వే శాఖ కాపలాదారు లేని లెవల్‌ క్రాసింగ్స్‌ మొత్తాన్ని తొలగించింది. ఆ 3 చోట్ల కూడా పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల పూర్తవుతాయి. దేశంలో కాపలాదారులేని లెవల్‌ క్రాసింగ్స్‌ లేని రాష్ట్రంగా తెలంగాణ కొత్త రికార్డు సృష్టించనుంది. 

ఒక్క ఘటన.. కదిలిన రైల్వే శాఖ 
2014 జూన్‌ 24.. తూప్రాన్‌ సమీపంలోని మాసాయి పేట లెవల్‌ క్రాసింగ్‌ వద్ద పాఠశాల బస్సు పట్టాలు దాటుతుండగా హైదరాబాద్‌–నాందేడ్‌ ప్యాసింజర్‌ రైలు ఢీకొన్న దుర్ఘటనలో బస్సు డ్రైవర్‌ సహా 20 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. పార్లమెంటును ఈ దుర్ఘటన కుదిపేసింది. ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అదే సమయంలో బిహార్‌లో కూడా ఇలాంటి దుర్ఘటనే జరగటంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇటీవల రైల్వే మంత్రిగా పీయూష్‌ గోయల్‌ బాధ్యతలు తీసుకున్నాక ఈ పనుల్లో వేగం పుంజుకుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా మూడొంతుల ప్రాంతాల్లో కాపలాలేని లెవల్‌ క్రాసింగ్స్‌ తొలగిస్తే.. తెలంగాణలో దాదాపు అన్నీ కనుమరుగయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోనూ మూడేళ్లలో 300 కాపలాలేని మార్గాలను తొలగించారు. మరో 63 చోట్ల తొలగించాల్సి ఉంది. వెరసి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 1,499 చోట్ల కాపలాదారులున్న లెవల్‌ క్రాసింగ్స్‌ కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వే భద్రత కోసం పనులు చేపట్టేందుకు కేంద్రం ప్రత్యేకంగా రాష్ట్రీయ రైల్‌ సంరక్షా కోశ్‌ పేరుతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఈ బడ్జెట్‌లో ఇందుకోసం రూ.73 వేల కోట్లను కేటాయించి పనులు చేపడుతున్నారు. వచ్చే సెప్టెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా ఎక్కడా అన్‌మ్యాన్డ్‌ లెవల్‌ క్రాసింగ్స్‌ ఉండబోవని రైల్వే శాఖ సగర్వంగా ప్రకటించింది.  

ఆరు గంటల్లో అండర్‌పాస్‌ రెడీ 
గతంలో రైల్వేలైన్‌ దిగువన అండర్‌పాస్‌ నిర్మిం చాలంటే నెలల సమయం పట్టేది. ప్రస్తుతం  ఆధునిక నిర్మాణ విధానాలతో కేవలం ఆరు గంటల్లోనే అండర్‌పాస్‌ సిద్ధమవుతోంది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ విధానంతో సిమెంట్‌ నిర్మాణాన్ని విడిగా నిర్మిస్తారు. రైల్వే లైన్‌కు రెండు వైపులా పొక్లెయిన్‌తో మార్గాన్ని ఏర్పా టు చేసి ఆరు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిపేస్తారు. పట్టాలు తొలగించి, పొక్లెయిన్‌తో కట్ట భాగం లో ద్వారం ఏర్పాటు చేసి సిమెంటు నిర్మాణాన్ని క్రేన్‌తో అందులో బిగిస్తారు. దానిపై పట్టాలు అమర్చి అండర్‌పాస్‌ గుండా వాహనాల రాకపోకలు ప్రారంభిస్తారు. కొద్దిరోజు ట్రయల్‌ వేసి, ఇబ్బంది రాకుంటే తిరిగి వేగాన్ని పునరుద్ధరిస్తారు. 

మాసాయిపేట ప్రమాదం జరిగేనాటికి పరిస్థితి ఇలా.. 
ద.మ.రైల్వే పరిధిలో మొత్తం లెవల్‌ క్రాసింగ్స్‌: 2122 
ఇందులో కాపలాదారు లేనివి: 640 
ఈ నాలుగేళ్లలో జరిగిన మార్పు ఇలా... 

రాష్ట్రంలో 121 కాపలాలేని గేట్లను తొలగించారు. 
(ఆదిలాబాద్‌–మహారాష్ట్రలోని పింపల్‌కుట్టి మధ్య మూడు చోట్ల తొలగించే పనులు జరుగుతున్నాయి.) 
అందులో దారులను రద్దు చేసినవి: 10 
కాపలాదారులను ఏర్పాటు చేసినవి:10 
అండర్‌పాస్‌లు నిర్మించినవి: 32 
రోడ్‌ అండర్‌ బ్రిడ్జిలను నర్మించినవి: 60 
రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మించినవి: 9

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)