amp pages | Sakshi

చిదంబరానికి ఎయిర్‌ సెల్‌ షాక్‌!

Published on Mon, 04/03/2017 - 15:14

న్యూఢిల్లీ: ఎయిర్‌ సెల్‌ మాక్సిస్‌ వ్యవహారం కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ నేత పీచిదంబరం మెడకు  తీవ్రంగానే చుట్టుకుంటోంది. ఒప్పదంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై  ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్ (ఇడి)  ఈడీ  తన రిపోర్టును   సుప్రీంకోర్టుకు సమర్పించింది  విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు (ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు)ఎఫ్‌ఐపీబీ  నిబంధనల ఉల్లంఘనలో  ఆర్థిక మంత్రిగా చిదంబరం పాత్రపై ఈడీ నివిదేకను  సుప్రీంకు అందించింది.  దీంతో దీనిపై తదుపరి విచారణను  కోర్టు మే 2 వ తేదీకి వాయిదా వేసింది.  మరోవైపు ఇప్పటికే ఈ కేసులో చార్జ్‌ షీటు దాఖలు చేసిన సీబీఐ ఈ కేసులో చిదంబరం పాత్రపై  విచారిస్తున్నట్టు కోర్టుకు వివరించింది.

 మరోవైపు ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో మనీలాండరింగ్ ఆరోపణ నేపథ్యంలో విచారణ జరపించాల్సిందిగా  బీజేపీ నేత సుబ్రహ్మణ్య  స్వామి కోర్టును ఆశ్రయించారు. అయితే ఫిబ్రవరిలో దీనిపై పూర్తి నివేదిక అందించించాల్సిందిగా స్వామిని కోరింది.  2016 నాటి  ఈ కేసుకు  కీలక సాక్ష్యాలను సమర్పించాల్సిందిగా  ఆదేశించింది. 

మాక్సిస్‌ అనుబంధం సంస్థ గ్లోబెల్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ రూ. 4,866 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందేందుకు 2006లో అనుమతి లభించింది.. విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఎఫ్‌ఐవివి అభ్యర్థనపై ఆర్థిక మంత్రిగా చిదంబరం అనుమతులు మంజూరు చేశారు.  అయితే నిబంధనలను విరుద్ధంగా  ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ ఒప్పందం  జరిగిందని  బీజేపీ  సీనియర్‌  సుబ్రమణియన్‌  స్వామి వాదిస్తున్నారు. 100 శాతం వాటా  అనుమతిద్వారా మలేషియా సంస్థ మాక్సిస్ నుంచి కార్తీ చిదంబరానికి భారీ ముడుపులు ముట్టాయని స్వామి ఆరోపించారు. 

ప్రధానంగా 74శాతం సీలింగ్ ఉండగా ఎక్కువ పెట్టుబడులకు అనమతించారని,   గరిష్టంగా రూ. 600 కోట్లు విలువైన ఎఫ్‌డీఐలకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థికమంత్రికి ఉంటుందని, అంతకు మించి పెట్టుబడులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదించవలసి ఉంటుందని  స్వామి పేర్కొన్నారు.
 
కాగా  చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అయితే  ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ ఒప్పందానికి అనుమతుల విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని చిదంబరం వాదిస్తున్న సంగతి తెలిసిందే.


 

 

Videos

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?