amp pages | Sakshi

భార్యకు దూరంగా ఉండాలని..

Published on Thu, 09/08/2016 - 12:25

ఆయన వయస్సు 70 ఏళ్లు. భార్యతో చాలా పెద్దగా గొడవ పడ్డాడు. ఇక భార్యను చూడొద్దు అనుకున్నాడు. 'జైలుకైనా వెళుతాను కానీ, ఇంటికి రాను' అని శపథం చేశాడు.  భార్యకు దూరంగా ఉండాలంటే విడాకులో, బ్రేకప్ చేసుకోవాలి.  చాలా పెద్ద ప్రాసెస్.. అందుకే ఆయన దగ్గరి మార్గాన్ని ఎన్నుకున్నాడు.

తన ఇంటికి సమీపంలో ఉన్న బ్యాంకుకు వెళ్లాడు. తన దగ్గర తుపాకీ ఉందని, కాబట్టి మర్యాదగా తనకు డబ్బు ఇవ్వాలని క్యాషియర్ ను భయపెట్టాడు. ఆ వృద్ధుడికి భయపడ్డ క్యాషియర్ మూడువేల డాలర్లు అతని చేతిలో పెట్టాడు. అయినా, ఆ మొండిఘటం అక్కడినుంచి కదల్లేదు. తీరా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ పెద్దాయనను అరెస్టు చేశారు.

యాహూ.. నా కల నెరవేరిందంటూ ఆ వృద్ధుడు ఎగిరి గంతేశాడు. అమెరికాలోని కాన్సస్ నగరంలో ఈ ఘటన జరిగింది. 70 ఏళ్ల లారెన్స్ రిపిల్ తన భార్య రెమిడియోస్ తో  గొడవ పడ్డాడు. ఇక భార్యను చూడొద్దు అనుకున్న ఆయన కాన్సస్ సిటీ బ్యాంకులో దోపిడికి పాల్పడ్డాడు. తన వద్ద తుపాకీ ఉందంటూ బెదిరించి డబ్బులు దోపిడి చేసిన ఆయన.. పోలీసులు వచ్చేవరకు వేచి ఉండి వారికి లొంగిపోయాడు.

గయ్యాళీ సూర్యకాంతం లాంటి భార్య ఉన్న ఇంటికంటే తన కొత్త లొగిలి అయిన జైలే బాగుందని, ఇక్కడ మంచి సహచర ఖైదీలు, టైమ్ కు తిండి, నిద్ర, సరైన వైద్య చికిత్స లభిస్తున్నాయని పెద్దాయన లారెన్స్ రిపిల్ ఇప్పుడు ఆనందపడిపోతున్నాడు.  
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌