amp pages | Sakshi

ఉద్యమ ద్రోహులుగా మిగిలిపోమా?

Published on Fri, 10/18/2013 - 03:43

సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంతకాలం సమ్మె చేసి ఏం సాధించాం? జీతాలతో పాటు పిల్లల భవిష్యత్‌ను పణంగా పెట్టి సమ్మె చేశాం. ఇప్పుడు ఆశించిన ఫలితం రాకుండానే విరమిస్తే.. ప్రజలకు ఏం సమాధానం చెప్తాం? ఇంతకాలం స్పష్టమైన హామీ వస్తేనే విరమిస్తామన్నాం.  ఇప్పుడు ఎలాంటి హామీ లేకుం డానే.. సమ్మె ఎందుకు విరమించాలి? ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలో ఎందుకు విఫలమయ్యాం? ప్రజలు స్వచ్ఛందంగా చేసిన ఉద్యమాన్ని పెట్టుబడిదారీ ఉద్యమం అని కేంద్ర మంత్రులే అంటుంటే ఎందుకు ప్రతిఘటించలేకపోతున్నాం? ఒకసారి ఎంపీల రాజీనామాలు కోరుతాం. మరోసారి వద్దంటాం. శాసనసభలో తీర్మానం ఓడిద్దామంటాం. అసలు శాసనసభకు తీర్మానమే రాదంటే.. మరేదో అంటాం. ఎందుకు మనకు స్పష్టత లేదు? అన్ని వ్యవస్థలను కలుపుకొని పోవడంలో ఎక్కడ విఫలమయ్యాం? ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపించి సమ్మె విరమిస్తే ఇప్పుడు జనం ఛీ కొట్టరా? ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని తాకట్టుపెడితే ఎలా?’’ సీఎంతో చర్చలకు ముందు గురువారం ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో సమ్మెకు నేతృత్వం వహించిన ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఎదుర్కొన్న ప్రశ్నాస్త్రాలివి. ప్రారంభం నుంచీ వాడివేడిగా సాగిన సమావేశంలో 52 సంఘాల నేతలు పాల్గొన్నారు.
 
 సమావేశంలో ముందుగా అశోక్‌బాబు మాట్లాడుతూ.. సమ్మె వల్ల చిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించారు. సమ్మెను తాత్కాలికంగా విరమించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎలా? అనే అంశం మీద అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. అనంతరం ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యమ నిర్వహణలో రాజకీయ పార్టీలతో సహా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్లడంలో విఫలం కావడానికి మన వైఖరే కారణమని విమర్శించారు. ఉద్యోగులుగా తమ శక్తి ఎంత అనే విషయం స్పష్టంగా తెలిసినా... ఉద్యమంలో చేరేందుకు ముందుకొచ్చిన పార్టీలను అడ్డుకుని నష్టపోయామన్నారు. అసెంబ్లీకి తీర్మానం వచ్చిన తర్వాత ఓడించడానికి ప్రయత్నించడం కంటే.. ఇప్పుడే శాసనసభను సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని పట్టుబడుతున్న పార్టీకి మద్దతు ఇచ్చి ఉంటే ఉద్యమం మరింత ఉధృతంగా సాగడానికి, ఉద్యమం నుంచి ఉద్యోగులు నిష్ర్కమించడానికి మేలైన మార్గం ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ఉద్యోగులు చేసిన ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుంటే మెరుగైన ఫలితం వచ్చి ఉండేదన్నారు.
 
 వెంకటేశ్వర్లు వాదనతో దాదాపు ఉద్యోగ సంఘాల నేతలంతా ఏకీభవించారు. విభజనపై ముఖ్యమంత్రికే స్పష్టత లేకుంటే తమకు వచ్చే హామీలో స్పష్టత ఏమి ఉంటుందని పలువురు నేతలు నిలదీశారు. సీఎం ఇచ్చే హామీని చూపించి సమ్మె విరమించడం కంటే.. ఉద్యోగులుగా తమ శక్తి ఇంతేనని, సమ్మె కొనసాగించలేమని, తమను క్షమించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసి సమ్మె విరమించడం మంచిదన్నారు. దాంతో ఉద్యమం ప్రజలు, రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లే అవకాశమైనా ఉందన్నారు. సమ్మె విరమణకు అదే గౌరవ ప్రమదమైన ముగింపు అవుతుందన్నారు. విభజన ప్రక్రియ వేగంగా సాగుతున్న సమయంలో సీఎం హామీతో సమ్మె విరమిస్తే.. ఉద్యోగులు అమ్ముడుపోయారని ప్రజలు తప్పుగా అర్థం చేసుకొనే ప్రమాదం ఉందన్నారు. ఒకానొక దశలో సమావేశంలో అశోక్‌బాబు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్యోగులు లేవనెత్తిన పలు అంశాలకు అశోక్‌బాబు వివరణ ఇస్తూ.. సీమాంధ్రలో అన్ని వ్యవస్థలు విఫలమైన తర్వాతే ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగాయని, సమ్మెను తాత్కాలికంగానే విరమిస్తున్నందున ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)