అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ ఇంట్లో ఆయుధాల తయారీ మెషీన్!
Published on Mon, 08/29/2016 - 16:37
రాయ్ పూర్: అక్రమంగా ఆయుధాలను నిల్వ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హోమియోపతి డాక్టర్ గా సేవలందిస్తున్న డా.అనిరుద్ధ చటర్జీ పెద్ద ఎత్తున ఆయుధాలను దాచిపెట్టినట్లు సమాచారం అందుకున్న రాయ్ పూర్ పోలీసులు సోమవారం అతడి ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చటర్జీ ఇంటిలోని మూడో అంతస్తులో పెద్ద ఎత్తున ఉంచిన బాణాలు, కత్తులు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి పోలీసులు ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో చటర్జీ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆయుధాలు తయారుచేసే మెషీన్ ను గుర్తించినట్లు సమాచారం. చటర్జీకి మావోయిస్టులతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
#
Tags