amp pages | Sakshi

‘అనంత’లో మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దగ్ధం

Published on Tue, 08/18/2015 - 20:49

అనంతపురం ఎడ్యుకేషన్: కడప జిల్లాలో నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు నందిని, మనీషారెడ్డి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని నిరసిస్తూ మంగళవారం అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. మంత్రి నారాయణ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతపురం నగరంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థల యాజమాన్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వెఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నగరంలోని నారాయణ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. బుధవారం రాయలసీమ వ్యాప్తంగా కార్పొరేట్ జూనియర్ కళాశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్, ఓసీ విద్యార్థి సంఘం బుధవారం విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్‌ఎస్‌యూ ఆధ్వర్యంలో గుంతకల్లు పట్టణంలో రాస్తారొకో చేశారు. కదిరి పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడ్డారు. ఉరవకొండ పట్టణంలో ఎబీవీపీ అధ్వర్యంలో వుంత్రి నారాయుణ దిష్టిబొవ్మును దహనం చేశారు.

Videos

లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్

చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..

ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు

సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ

నారా లోకేష్ కు ఈ దెబ్బతో..!

మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు

BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట

కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్

ఫోన్ ట్యాంపరింగ్ పై కేసీఆర్ కీ కామెంట్స్

మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)