amp pages | Sakshi

ఎవరెస్టు.. చిన్నబోయేటట్టు..

Published on Mon, 12/26/2016 - 06:35

ఎవరెస్టు ఎత్తుతో పోలిస్తే దీని ఎత్తు 300 రెట్లు ఎక్కువ..

పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు  చేసేశారు. చలామణిలో ఉన్న కరెన్సీ విలువలో ఇది 86 శాతం.. అంటే 2,203 కోట్ల నోట్లు.. మీకో విషయం తెలుసా? ఈ కరెన్సీ కొండ ముందు ఎవరెస్టు కూడా చిన్నబోవాల్సిందే. ఎందుకంటే.. ఈ నోట్లను ఒకదానిపై ఒకటి పెడితే.. ఎవరెస్టు ఎత్తుకు 300 రెట్లు ఎక్కువుంటుందట. ఒకదాని పక్కన ఒకటి రోడ్డులా పరిస్తే.. చంద్రుడి వద్దకు ఐదుసార్లు వెళ్లిరావచ్చట. అసలు రద్దయిన నోట్లను ఆర్‌బీఐ ఏం చేస్తుంది?

విభజించు..
2001 వరకూ వాటిని తగులబెట్టేవారు. తర్వాత నుంచి పర్యావరణ అనుకూల విధానాలను అనుసరిస్తున్నారు.
2003 నుంచి రద్దయిన, పాడైపోయిన నోట్లను వేగంగా ప్రాసెస్‌ చేయడానికి కరెన్సీ వెరిఫికేషన్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను (సీవీపీఎస్‌) పెట్టారు. అప్పటి గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ హయాంలో ఇవి వచ్చాయి.
ఒక్కో సీవీపీఎస్‌ గంటకు 60 వేల నోట్లను ప్రాసెస్‌ చేస్తుంది. బాగున్న నోట్లను జాగ్రత్తగా కట్‌ చేసి.. వాటిని కొత్త కరెన్సీ పేపర్‌ తయారీలో వాడతారు.  

విక్రయించు..
బాగోలేని, పనికిరాని నోట్లను కంప్రెస్‌ చేసి.. ఇటుకలుగా, బ్లాకులుగా మారుస్తారు. వీటిని పారిశ్రామిక అవసరాల నిమిత్తం విక్రయిస్తారు. ఇందుకోసం ఆర్‌బీఐ టెండర్లను పిలుస్తుంది. కిలో రూ.5–6 మధ్య విక్రయిస్తారు.

వీటిని కొన్ని కంపెనీలు ఫర్నేస్‌లను మండించడానికి వాడతాయి. మరికొన్ని సాఫ్ట్‌ బోర్డుల తయారీకి వినియోగిస్తాయి.
అంతేకాదు.. క్యాలెండర్లు, ఫైళ్లు, సావనీర్లు, పేపర్‌ వెయిట్లుగా వీటిని మారుస్తారు.     
– సాక్షి, తెలంగాణ డెస్క్‌

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)